'బృందావనం' హిట్టయినా ఆనందం లేదు...దిల్ రాజు
మా "బృందావనం" హిట్టై అందరి మన్ననలూ అందుకుంటున్నందుకు ఆనందపడాలో..లేక ఈ చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలను అప్పుడే ట్రైన్స్‌లో, ఫుట్‌పాత్‌ల మీద పెట్టి అమ్ముతున్నందుకు బాధపడాలో అర్థం కావడంలేదు. ఇంత విజయాన్ని సాధించి కూడా ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఎన్టీఆర్ హీరోగా ఆయన నిర్మించిన బృందావనం చిత్రం క్రితం వారం భారీ ఎత్తున విడుదలైంది. అయితే ఈ చిత్రం పైరసీ కూడా అప్పుడే మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అలాగే...హైదరాబాద్ లోని కోఠి, నెల్లూరు, వరంగల్, కడప, రాజమండ్రి ప్రాంతాల్లో బృందావనం పైరసీ సీడీలను పట్టుకొని సదరు వ్యక్తులపై కేసులను కూడా పెట్టాం. ఈ విషయమై ఇటీవలే డీజీపిని కలిసి పైరసీని అడ్డుకోవలసిందిగా కోరాం. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి..రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు చర్య తీసుకోవలసిందిగా ఫాక్స్ చేశారు. మాకు ఇంతటి సహకారాన్ని అందించిన డీజీపీగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అన్నారు.


Click it and Unblock the Notifications











