ప్రకాష్ రాజ్‌తో విభేదాలపై దిల్ రాజు
దిల్ రాజుకు,ప్రకాష్ రాజు కు ఆ మధ్యన చెడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం సమయంలో చేస్తానన్న కార్యక్టర్ చేయటానికి ఆసక్తి చూపలేదని చెప్పుకున్నారు. చివరకు దిల్ రాజు వెళ్లి ప్రకాష్ రాజు ని కలిసి రాజీ చేసుకుని సినిమా పూర్తి చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై దిల్ రాజు ఓ మీడియా సంస్దకు వివరణ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ..నిజానికి ప్రకాష్ రాజ్ ది కేవలం అలకే... మీడియానే పెద్దగా చూపించింది. ప్రకాష్‌రాజ్ చాలా సెన్సిటివ్. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన తీసిన ధోనీ సినిమా తెలుగు వెర్షన్‌ను నన్ను రిలీజ్ చేయమన్నాడు. దాని ప్రమోషన్ సరిపోలేదని భావించి, తక్కువచోట్ల విడుదల చేశాం. ఓపెనింగ్స్ నిరాశపర్చడంతో మళ్లీ ప్రమోషన్ మొదలుపెట్టాడు.
అలాగే అప్పట్లో ఓసారి ఏదో సమస్యలో ఉండి పట్టించుకోకపోవడంతో అలిగాడు. తర్వాత రాజస్థాన్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్నాడని తెలిసి, వెళ్లి కలిశాం. అస లు విషయమేంటో చెప్పడం కలిసిపోవడం సాధారణమే అన్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి చెపుతూ..తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. 'సింపుల్ అండ్ బ్యూటిఫుల్'చిత్రం ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా చేస్తున్నారు. సమంత,అంజలి, జయసుధ, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రధారులు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్‌లో ప్రధాన తారాగణంపై కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











