రోడ్డు ప్రమాదంలో టాలెంటెడ్ మీమర్ మృతి.. ముఖ్యమంత్రి సంతాపం.. సీఎం వీడియో వైరల్

సోషల్ మీడియాలో మీమ్స్‌తో దేశవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించుకొన్న ప్రతిభావంతుడు దేవ్‌రాజ్ పటేల్ ఇకలేరు. దిల్ సే బురా లగ్తా హై ఫేమ్ దేవరాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో మందిని విషాదానికి గురి చేసింది. దేవరాజ్ పటేల్ మరణవార్త వినగానే స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. దేవరాజ్ పటేల్ మృతికి సోషల్ మీడియాలో పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. దేవరాజ్ పటేల్ మరణవార్త వివరాల్లోకి వెళితే..

దేవ‌రాజ్ పటేల్ కొద్ది సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. దిల్ సే బురా లగ్తా హై అంటూ పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. దాంతో కొద్ది రోజుల్లోనే ఈ టాలెంటెడ్ అబ్బాయికి గణనీయంగా ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దాంతో పాపులర్ మీమర్‌గా ఎంతో మందిని తన వీడియోలు, పోస్టులతో ఆకట్టుకొన్నారు.

Dil se lagta hai fame Devraj Patel no more: Chhattisgarh Chief Minister Bhupesh Baghel Video Viral

దేవ్ రాజ్ పటేల్ మరణ వార్తను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రరి భూపేష్ భగేల్ సోషల్ మీియాలో పోస్టు చేయడంతో వైరల్ కావడమే కాకుండా ఈ వార్త ప్రపంచానికి తెలిసింది. దేవరాజ్ పటేల్ ఎన్నోవీడియోలతో మనకు ఎంతో వినోదాన్ని పంచారు. దిల్ సే బురా లగ్తా హై అంటూ కోట్లాది మందిని ఆకట్టుకొన్న ప్రతిభావంతుడైన అబ్బాయి మన నుంచి దూరమయ్యారు. అద్బుతమైన ప్రతిభావంతుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. దేవ్‌రాజ్ పటేల్ మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా సంతాపం. ఓం శాంతి అంటూ ట్వీట్‌లో భూపేష్ భగేల్ పేర్కొన్నారు.

తనతో కలిసి బ్లాగ్ చేస్తున్న దేవరాజ్ పటేల్ వీడియోను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ షేర్ చేశారు. ఈ బ్లాగ్‌తో దేవ రాజ్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు వ్యక్తులు ఫేమస్ అయ్యారు.ఒకటి నేను, మరోకరు కాకా. కాక బాగున్నావా? మీరు చాలా స్మార్ట్ అవుతారు అని తన పోస్టులో సీఎం పేర్కొన్నారు.

మీమర్ దేవ్‌రాజ్ పటేల్ గురించి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ షేర్ చేసిన వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. వందలాది మంది పోస్టుకు స్పందించారు. దేవ్‌రాజ్‌కు సంతాపం తెలియజేస్తూ శ్రద్దాంజలి ఘటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X