కె.విశ్వనాధ్ టైటిల్ 'సుమధురం' కాదు మరి...
కె.విశ్వనాధ్, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సుమధరం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే విశ్వనాధ్ వేరే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవి ఝుమ్మంది నాదం, శుభోదయం, మధురం మధురం అనే టైటిల్స్ ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ నగరం లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హరి గోపాల కృష్ణ మూర్తి, షీలా నీల తిలక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వరంగల్ యాసిడ్ దాడుల నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. హీరోయిన్ పై యాసిడ్ దాడి జరిగిన తర్వాత హీరో ఎలా స్పందించాడు, ఆ తర్వాత జరిగే పరిణామాలు చుట్టూ కథనం తిరుగుతుందని తెలుస్తోంది. మంజరి ఫర్నాండెస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
More from Filmibeat
కె విశ్వనాధ్ అల్లరి నరేష్ మంజరి ఫర్నాండెస్ సుందరాకాండ సరదాగా కాసేపు k viswanath allari naresh bendu apparao betting bangarraju subhodayam sumadhuram


Click it and Unblock the Notifications











