మహా నటుడి ఆత్మకథ ఆవిష్కరణకు అంతా సిద్దం

By Srikanya

ముంబయి: మహానటుడు దిలీప్‌ కుమార్‌ జీవిత ఘట్టాలను కళ్లెదుట నిలిపే ఆయన ఆత్మకథ ' దిలీప్‌ కుమార్‌: ది సబ్‌స్టెన్స్‌ అండ్‌ ది షాడో' పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. యూసఫ్‌ఖాన్‌గా జన్మించిన ఆయన వెండితెరపై దిలీప్‌కుమార్‌గా వెలుగువెలిగిన వైనాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుంది.

అరవైఏళ్ల సినీ ప్రస్థానంలో దిలీప్‌కుమార్‌కు ఎదురైన అనుభవాలు, ఎంతగానో ప్రేమించిన అందాల నటి మధుబాలను చేసుకోలేక తపనపడిన వైనాన్ని...తనకంటే 22 ఏళ్లు చిన్నదైన చక్కనిచుక్క సైరాబానును పెళ్లిచేసుకున్న పరిస్థితులను స్వయంగా వివరించారు.

Dilip Kumar's autobiography sets for launch

జుగ్ను, దేవదాసు, అందాజ్‌, మేలా వంటి చిత్రాల్లోని పాత్రల్లో జీవించి వాటి తీవ్రతకు మానసికంగా దెబ్బతిన్న రోజుల్లో బ్రిటిష్‌ మానసిక వైద్యనిపుణుడు సాయం చేసిన తీరును...ఆ తర్వాత హాస్యచిత్రాల్లో నటించడం ద్వారా సాంత్వన పొందిన నాటి అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

హిందీ చిత్రసీమకు పెద్ద దిక్కులాంటివారు దిలీప్‌కుమార్. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన కథానాయకుడాయన. ముఖ్యంగా విషాదాంత ప్రేమకథలపై చెక్కుచెదరని ముద్ర వేశారాయన. అందుకే ఆయన్ని 'ట్రాజెడీ కింగ్' అంటారు. ఇటీవలే ఈ బాలీవుడ్ లెజెండ్ 91వ పుట్టినరోజు జరుపుకున్నారు.

దిలీప్ వ్యక్తిగత, వృత్తిజీవితం గురించి తెలుసుకోవాలని ఈ తరం వారికీ ఆసక్తి ఉంది. అయితే పూర్తి స్థాయి సమాచారం దొరకడంలేదు. ఆ లోటు త్వరలోనే నెరవేరనుంది. దిలీప్‌కుమార్ ఆత్మకథతో 'సబ్‌స్టన్స్ అండ్ ది షాడో' పేరుతో ఓ పుస్తకం తయారయ్యింది. సబ్‌స్టన్స్ అంటే సారాంశం, పదార్థం, సారం.. ఇలా పలు అర్థాలు వస్తాయి.

దిలీప్ అసలు పేరు యూసుఫ్‌ఖాన్‌ని ఉద్దేశించి సబ్‌స్టన్స్ అని, ది షాడో అంటే దిలీప్‌కుమార్ అనే వెండితెర పేరును ఉద్దేశించి పెట్టినదని సమాచారం. సహనటీనటులతో తన అనుబంధం, రాజ్‌కపూర్, దేవానంద్ లాంటి నటులతో ఉన్న వైరం.. ఇలా పలు విషయాలను స్వయంగా దిలీప్‌కుమార్ చెప్పగా, రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. మధుబాలతో తన అనుబంధం గురించి కూడా దిలీప్ అందులో చెప్పారట.

జూన్ 9న అమితాబ్‌బచ్చన్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. దిలీప్‌కుమార్ సతీమణి, నటి సైరాభాను పరిశ్రమ ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి, ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. దిలీప్‌సాబ్ జీవితంలోనే అత్యంత ఘనమైన వేడుకలా చేయాలనే ఆకాంక్షతో సైరాభాను ఉన్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X