నేను క్షేమంగానే ఉన్నా: దిలీప్ కుమార్ ట్వీట్
హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖుడు, సీనియర్ నటుడు దిలీప్ కుమార్ గురించి నాలుగు రోజులుగా రకరకాల పుకార్లు వ్యాప్తిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులు వ్యాపించాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ఆయన...ఇంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఏమిటంటూ ఇతర బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు కలవర పడ్డారు.
అయితే ఈ వదంతులకు స్వయంగా చెక్ పెడుతూ...ట్వీట్టర్ ద్వారా సందేశం పంపారు 91 ఏళ్ల దిలీప్ కుమార్. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ట్విట్టర్ లో ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్నేహితులు, అభిమానులు అందరికీ తెలిపారు. అంతేగాక, తన పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. "ఎంతోమంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు చూపుతున్న ప్రేమ, చేస్తున్న ప్రార్థనలు, అల్లా దీవెనలకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను" అన్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఆయన ఆరోగ్యం గురించి నిన్న ట్వీట్ చేసారు. దిలీప్ జీ క్షేమంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. పుకార్లు నమ్ము వద్దు అంటూ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సందేశం పంపారు. మొత్తానికి దిలీప్ కుమార్ గురించిన వదంతులకు తెర పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











