దేవీ శ్రీ, దిల్ రాజు సిట్టింగ్ బోర్డ్స్.. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు మెసేజ్ పెట్టారు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హై టెక్నీకల్ వాల్యూస్, భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం మహర్షి. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేసింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై రూపొందించబడిన ఈ సినిమాకు అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ కెరీర్‌లో ఇది 25 వ సినిమా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

DilRaju, Devi Sri Prasad messaged midnight 2:30 said Mind blowing

భారీ అంచనాల నడుమ మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతూ ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది. చిత్రంలో రైతు కష్టాలను చూపించిన తీరుకు బాగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోందీ సినిమా. ఊహించిన దానికి మించి రెస్పాన్స్ వస్తుండటంతో ఆనందోత్సాహంలో మునిగితేలుతున్న చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలను గుర్తుచేసుకుంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న డైరెక్టర్ వంశీ పైడిపెల్లి, హీరో మహేష్ బాబు, నిర్మాత దిల్ రాజు చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. తన 20 సంవత్సరాల జర్నీలో మహర్షి సినిమా తనకెంతో ప్రత్యేకమైందని మహేష్ బాబు అన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అవటం కన్నా మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన విజయం అని ఆయన తెలిపారు. చిత్ర రీ రికార్డింగ్ పూర్తయ్యాక మొదట సినిమా ఎవరు చూశారానే ప్రశ్నకు వంశీ పైడిపెల్లి బదులిస్తూ దేవి శ్రీ ప్రసాద్, దిల్ రాజు అని తెలిపారు. ఈ ఇద్దరూ మహర్షి సినిమాకు సిట్టింగ్ బోర్డ్స్ అని ఆయన అన్నారు.

ఇక ఇదే ప్రశ్నపై మహేష్ బాబు స్పందిస్తూ దేవీ శ్రీ జడ్జ్మెంట్ చాలా బాలాగుంటుందని చెప్పారు. ఓ సగటు ప్రేక్షకుడి కోణంలో ఆయన సినిమాను చూసి జడ్జ్ చేస్తారని, ఆయన జడ్జ్మెంట్‌కి తిరుగే లేదని మహేష్ అన్నారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక ఒకరోజు అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు దేవీ శ్రీ మెసేజ్ చేశారని, సినిమా సూపర్.. మైండ్ బ్లోయింగ్ అని ఆయన అన్నారని మహేష్ చెప్పుకొచ్చారు. వంశీతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేసినప్పటికీ తనకు దేవీ శ్రీ, దిల్ రాజు ఇద్దరే చాలా ఇంపార్టెంట్ అని మహేష్ చెప్పడం విశేషం. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మహేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X