తెలుగు అమ్మాయిలూ ఇక మీ ఇష్టం!!!
కొత్త బంగారు లోకం సినిమా తీయనున్న నిర్మాత దిల్ రాజుకు హీరోయిన్ కావలెనట. హీరో దొరికాడు. హ్యాపీడేస్ వరుణ్ సందేశ్. వరుణ్ కు జోడీ కావలెనని యాడ్ కూడా ఇచ్చాడు. హీరోయిన్ లు కరువా..అనుకుంటున్నారా...కరువే. దిల్ రాజుకు తెలుగు అమ్మాయే కావెలనట. అదీ కండీషన్. ఇందుకోసం తెలుగు టెలివిజన్ చానెళ్లకు యాడ్ కూడా ఇచ్చాడు. తెలుగు అమ్మాయి అయి ఉండడమే కాదు 16-19 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవలెను. చక్కని రూపం కలిగి ఉండవలెనుట. కొంచెం చదువుకొని కూడా ఉండాలట. ఇవన్నీ ఉన్నవాళ్లు దొరక్కపోతే జెనీలియాను హీరోయిన్ గా తన సినిమాలో నటింపజేస్తాడట. తెలుగు అమ్మాయిలూ ఇక మీ ఇష్టం.


Click it and Unblock the Notifications