స్వామిజీతో దొరికేసిన డింపుల్ హయాతి.. అందుకోసమే ఇలా.. ఆ స్టార్ హీరోయిన్ల లాగే!

సూపర్ హిట్టు నీ హైటు అంటూ తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఫేమస్ అయిన ఈ డస్కీ బ్యూటీ డింపుల్ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సుందరి పోలీసులతో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్లందరూ తమ టాలెంట్ ను మాత్రమే కాకుండా జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతుంటారు. అందుకోసం పూజలు చేస్తుంటారు. అలాంటి వారి జాబితాలో తాజగా డింపుల్ హయాతి చేరింది. అసలు విషయం ఏంటని చూస్తే..

అందంపై విమర్శలు:విజయవాడకు చెందిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ డింపుల్ హయాతి నటిగా 'గల్ఫ్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాలు డింపుల్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అంతేకాకుండా ఆమె అందంపై విమర్శలు చేసిన మేకర్స్ కూడా ఉన్నారని ఒక సమయంలో చెప్పుకొచ్చింది డింపుల్.

Dimple Hayathi Performs Pooja With Celebrity Astrologer Venu Swamy

ఐటమ్ సాంగ్ తో పేరు:హీరోయిన్ గా అవకాశాలు అందుకోని డస్కీ సుందరి డింపుల్ హయాతి స్పెషల్స్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చింది. వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ మూవీలో సూపర్ హిట్టు అంటూ చెలరేగిపోయి డ్యాన్స్ చేసిన డింపుల్ హయాతికి మొదటిసారిగా గుర్తింపు వచ్చింది. ఇందులో ఆమె హావాభావాలకు, స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో డింపుల్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది.

Dimple Hayathi Performs Pooja With Celebrity Astrologer Venu Swamy

వరుసగా ప్లాప్స్:అనంతరం రవితేజ ఖిలాడి సినిమాలో మరోసారి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది బొద్దుగుమ్మ డింపుల్ హయాతికి. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా డింపుల్ కు మాత్రం మంచి పేరే దక్కింది. ఇటీవలే గోపీచంద్ సరసన నటించిన ఈ డస్కీ భామ రామబాణం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో డింపుల్ కు నిరాశ ఎదురైంది.

Dimple Hayathi Performs Pooja With Celebrity Astrologer Venu Swamy

పోలీసుతో గొడవ:ఇక ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతికి జరిగిన గొడవ, కోర్టు, కేసు విషయాల సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సెలబ్రిటీల జాతకం చెబుతూ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు వేణు స్వామి. ఆయన జ్యోతిష్యంతోపాటు సెలబ్రిటీల ఇళ్లలో పూజలు, యాగాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్ ప్రత్యేక పూజలు చేయించారు. వీరి జాబితాలో డింపుల్ తాజాగా చేరింది.

Dimple Hayathi Performs Pooja With Celebrity Astrologer Venu Swamy

ఇంట్లో పూజలు:డింపుల్ హయాతి ఇంట్లో వేణు స్వామి యాగం సహా పలు పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డింపుల్ హయాతి జాతకంలో ఏదైనా దోషం ఉండొచ్చని, వాటికి నివారణగా వేణు స్వామి పూజలు చేయించారని టాక్ నడుస్తోంది. వివాదాలు, సినిమా ప్లాప్ లతో సతమతం అవుతోన్న డింపుల్ ను బయట పడేసేందుకే ఈ పూజలు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X