సెక్సీ చేష్టలతో రెచ్చిపోయారు, నొచ్చుకున్న సీనియర్ నటి!
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి డింపుల్ కపాడియా ప్రధాన పాత్రలో గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వాట్ ది ఫిష్'. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. గత కొంతకాలంగా సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలపై డింపుల్ కపాడియా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాకు ప్రచారం కల్పించడంలో భాగంగా నిర్మాతలు బాలీవుడ్ సెక్స్ బాంబులైన పూనమ్ పాండే, రాఖీ సావంత్‌లను రంగంలోకి దింపారు. వారితో బికినీలు, హాట్ అండ్ సెక్సీ డ్రెస్సలు వేయించి సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వారు సినిమాలో నటించక పోయినా....కేవలం మీడియా, జనాల దృష్టిని ఆకర్షించడానికే నిర్మాతలు ఈ విధమైన ప్రచారం చేపట్టారు.

వీరితో పాటు సినిమా ప్రచారంలో పాల్గొనడం ఇష్టంలేని ప్రధాన పాత్రధారి డింపుల్ కపాడియా దూరంగానే ఉంటున్నారు. ఇలా చేయడం చీఫ్ పబ్లిసిటీనే అని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వీలైనంత పబ్లిసిపటీ పెంచేందుకు ప్రయత్నించారు. మరి బాక్సాఫీసు వద్ద సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











