‘జాతి రత్నాలు’పై ఇండియన్ క్రికెటర్ ట్వీట్: మూవీ మొత్తం అలాగే.. అది అందరికీ సాధ్యం కాదంటూ కామెంట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తుంటాయి. ఇక, ఈ మధ్య కాలంలో ఇలా వచ్చి.. ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'జాతి రత్నాలు' ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్లనూ అదే రీతిలో వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ సినిమాపై తాజాగా టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

‘జాతి రత్నాలు'గా వచ్చిన నవీన్ పోలిశెట్టి

‘జాతి రత్నాలు'గా వచ్చిన నవీన్ పోలిశెట్టి

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ చిత్రం అంటూ

ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ చిత్రం అంటూ

'జాతి రత్నాలు' మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో కామెడీని చూపించిన విధానం బాగా ఆకట్టుకుంది. మొదటి నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య కాలంలో హాస్యభరితంగా వచ్చిన చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిందీ మూవీ.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత మొత్తం రాబట్టింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత మొత్తం రాబట్టింది?

ముగింపు సమయానికి 'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.52 కోట్లు షేర్ వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.28 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుతూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.

టాలీవుడ్ హిస్టరీలోనే నాలుగో సినిమాగా

టాలీవుడ్ హిస్టరీలోనే నాలుగో సినిమాగా

టాలీవుడ్‌లో ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం చిత్రాల జాబితాలో రూ. 27.02 కోట్లతో 'జాతి రత్నాలు' నాలుగో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు 'గీత గోవిందం' రూ. 55.43 కోట్లతో మొదటి స్థానంలో, 'ఉప్పెన' రూ. 31.02 కోట్లతో రెండో స్థానంలో, 'ఫిదా' రూ. 30.50 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' రూ. 22.78 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

 అమెజాన్‌లో విడుదల.. చూసిన క్రికెటర్

అమెజాన్‌లో విడుదల.. చూసిన క్రికెటర్

థియేటర్లలో సందడి చేసి నవ్వులు పంచిన 'జాతి రత్నాలు' మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తోంది. అందులో సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి కాబట్టి.. మిగితా భాషలకు సంబంధించిన వాళ్లు కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా ఈ సినిమాకు వీక్షించాడు.

Recommended Video

Naveen Polishetty ఎమోషనల్ కామెంట్స్ On Sushant Singh Rajput
‘జాతి రత్నాలు'పై ఇండియన్ క్రికెటర్ ట్వీట్

‘జాతి రత్నాలు'పై ఇండియన్ క్రికెటర్ ట్వీట్

దినేష్ కార్తీక్ 'జాతి రత్నాలు' సినిమాను చూశాడు. అనంతరం దీని గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అందులో 'జాతి రత్నాలు.. మై గాడ్.. ఏంటా కామెడీ.. ప్రతి సీన్‌లోనూ నవ్వుతూనే ఉన్నాను. డైలాగులు, అందరి యాక్టింగ్, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం ఇలా నవ్వించడం సాధ్యం కాదు. కానీ దాన్ని మీరంతా సుసాధ్యం చేశారు. గ్రేట్ వర్క్' అంటూ యూనిట్‌ను ప్రశంసించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X