Keeda Cola Teaser Review: బొద్దింక చూట్టే కథ.. డాన్ గా తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం ఈజ్ బ్యాక్!
తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత దర్శకత్వం వైపు చూడటం మానేశాడు. పలు సినిమాల్లో నటుడిగా అలరించిన ఆయన.. డైరక్టర్ అవతారం ఎత్తేందుకు గ్యాప్ తీసుకున్నాడు. ఈ దర్శక నటుడు.. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరదించి.. కీడా కోల సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా ట్రైలర్ రిలిజీ అయి ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే...
కీడా కోలా టీజర్ రిలీజ్:కీడా కోలా.. ఈ సినిమా తరుణ్ భాస్కర్ అనౌన్స్ చేసినప్పటీ నుంచే ఆకట్టుకుంటోంది. ఓ మూత ఉన్న పోస్టర్ పై టైటిల్ ఉండటం చూసి... ఇదేం టైటిల్ రా బాబు అనుకున్నారు కూడా. ఇక గత పది రోజులుగా కీడా కోలా అంటూ తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమాను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీరోజు ఈ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ మంచి బజ్ తీసుకు వచ్చాడు. డైరెక్టర్ గా దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ఇక ఈ సినిమాలో బ్రహ్మనందంను కీలకపాత్రలో పెట్టి సినిమా తీయడంతో అందరిలోనూ తెలియని ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది.
కోలాలో బొద్దింక ఏంటి..:టీజర్ విషయానికి వస్తే... కోలా బాటిల్ ను బ్రహ్మీ, చైతన్య రావు అనుమానాస్పదంగా చూస్తున్న సీన్‌తో టీజర్ మొదలవుతుంది. ఈ టీజర్ చూస్తుండే.. అంతగా ఏమి రిలీవ్ చేయకపోయినా... ఈ సినిమా మొత్తం ఆ కోలా బాటిల్ చుట్టే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోలాను ప్రధానంగా చూపిస్తూ గన్నులు, ఫైరింగ్, యాక్షన్ సీన్స్ వస్తూ ఉంటాయి. అయితే చివర్లో కోలా లోంచి బొద్దింక పైకి వస్తున్నట్లు చూపించాడు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ కీలకంగా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇక చివరలో డాన్ గా తరుణ్ భాస్కర్ కనిపిస్తాడు. మొత్తంగా టీజర్ చూస్తుంటే కాస్త డిఫరెంట్‌గానే ఉందనే చెప్పాలి.

బొద్దింక చుట్టే కథ:ఈ మూవీ టైటిల్ లోని కీడా అంటే బొద్దింక అని అర్ధం. అయితే టీజర్ లో ఈ కీడా ఒక కోలాలో చిక్కుకొని కనిపిస్తుంది. మూవీ స్టోరీ మొత్తం ఈ కీడా అండ్ కోలా చుట్టూ సాగబోతుందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి బొద్దింకతో కోలా ఏమైనా తయారు చేస్తారా.. లేదా ఆ బొద్దింకతో ఇంకేం చేయబోతున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఈ సినిమాపై భారీ అంచనాలు:ఇక ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వరదరాజు తాతగా కనిపించనున్నాడు. అలాగే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ లో నటించిన చైతన్య రావు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతుంది. తరుణ్ దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నాడు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











