‘జెర్సీ’ మూవీపై టాప్ డైరెక్టర్ రాజమౌళి రివ్యూ...

Recommended Video

Jersey Movie Review By Baahubali Director SS Rajamouli || Filmibeat Telugu

తెలుగులో ఏదైనా సినిమా విడుదలైందంటే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రివ్యూ కోసం తెలుగు సినీ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా అదిరిపోయింది అంటూ ఆయనగానీ రివ్యూ ఇచ్చారంటే ఆ మూవీకి వసూళ్ల పండగే. అయితే రాజమౌళి ఒక సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి చాలా కాలమైంది.

గతేడాది 'గీత గోవిందం' తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా రివ్యూ రాలేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు ఆయన చూలేదా? లేక ఏవీ నచ్చలేదా? అనే విషయం తెలియదు కానీ... చాలా రోజుల తర్వాత రాజమౌళి నుంచి 'జెర్సీ' మూవీ గురించి ట్వీట్ చేశారు.

హార్ట్ వార్మింగ్, జాయ్‌ఫుల్ మూవీ అంటూ...

హార్ట్ వార్మింగ్, జాయ్‌ఫుల్ మూవీ అంటూ...

‘జెర్సీ' మూవీ గురించి సోమవారం ఉదయం రాజమౌళి ట్వీట్ చేశారు. ఇది మనసుకు హత్తుకునే సినిమా. జాయ్ ఫుల్ మూవీ అంటూ ప్రశంసలు గుప్పించారు. దీన్ని బట్టి సినిమా ఆయనకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై ప్రశంసలు

దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై ప్రశంసలు

‘ జెర్సీ స్క్రిప్టు రాసిన విధానం బావుంది. ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా క్రాఫ్ట్ చేయబడి, డైరెక్ట్ చేయబడింది. వెల్ డన్ గౌతమ్ తిన్ననూరి' అంటూ ఈ సందర్భంగా రాజమౌళి ‘జెర్సీ' మూవీ దర్శకుడి గురించి వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరూ గర్వపడే మూవీ

‘‘జెర్సీ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ గర్వపడే సందర్భం ఇది. నాని ‘బాబు' సూపర్‌గా చేశావ్. జస్ట్ లవ్ యూ అంతే.''అని రాజమౌళి పొగడ్తల వర్షం కురిపించారు.

ఇంతకంటే ఆనందం లేదు సార్ అంటూ నాని రిప్లై

రాజమౌళి ట్వీట్ మీద నాని స్పందిస్తూ... ‘సార్.. ఇంతకంటే ఆనందం ఏమీ ఉండదు. వి లవ్ యూ టూ’ అని ట్వీట్ చేశారు.

బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న జెర్సీ

బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న జెర్సీ

మరో వైపు ‘జెర్సీ' బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. తొలి 3 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది.

రానా రివ్యూ

రానా రివ్యూ

జెర్సీ మూవీ అద్భుతంగా ఉంది. సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా చెప్పినకథ. గౌతమ్ తన సినిమా కోసం పర్ఫెక్ట్ నటులను, టెక్నీషియన్లను ఎంపిక చేసుకున్నాడు. నాని ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్ గారు మెప్పించారు... అంటూ రానా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X