హీరో సుదీప్ ను బెదిరించిన దర్శకుడు.. డబ్బుల విషయంలో మోసం చేశాడంటూ..
ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. కిచ్చా సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు మల్టీ టాలెంటెడ్ సుదీప్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, టీవీ వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకుని కన్నడ ఇండస్ట్రీలో టాప్ లో హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.
ఎప్పుడూ తన సినిమా ప్రాజెక్టులతో వార్తల్లో నిలిచే సుదీప్ కొన్ని రోజుల క్రితం నాన్ సినిమా వార్తల్లో కనిపించాడు. గత నెలలో సుదీప్ ను బెదిరిస్తూ ఓ లెటర్ వచ్చింది. ఈ వార్త కొన్ని రోజుల క్రితం చర్చనీయాంశంగా మారింది. ఈ బెదిరింపు లేఖ రాసింది ఎవరు, కిచ్చా సుదీప్ కు రాయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయి.

బెదిరింపు లేఖను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ కేసులో భాగంగా ఓ స్టార్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు కిచ్చా సుదీప్ ఇద్దరూ మిత్రులేనని గుర్తించారు పోలీసులు. ఆ స్టార్ డైరెక్టర్ పేరు రమేష్ కిట్టి. ఈయన కిచ్చా సుదీప్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి వీరిద్దరు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్లు తెలుస్తోంది.
కిచ్చా సుదీప్, రమేష్ కిట్టి ఇద్దరూ కలిసి ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. రమేష్ కిట్టినే దీనికి ప్రెసిడెంట్. అయితే ట్రస్ట్ ఫండ్స్ విషయంలో కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ అయిన డైరెక్టర్ రమేష్ కిట్టీ ట్రస్టులో రూ.2 కోట్లు పెట్టగా.. ఆ డబ్బుల విషయంలో సుదీప్, రమేష్ ను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై రమేష్ కిట్టీ కిచ్చా సుదీప్ ను బెదిరిస్తూ లేఖ రాసినట్లు సమాచారం.
ఈ బెదిరింపుల వ్యవహారంలో డైరెక్టర్ రమేష్ కిట్టీతో పాటు మరి కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిచ్చా సుదీప్ బెదిరింపుల కేసు కీలక మలుపు తీసుకోవడాన్ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు గమనిస్తున్నాయి. ఇందులో ఎవరు చెప్పేది నిజమో తెలియాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే సుదీప్ ను బెదిరించినందుకు డైరెక్టర్ రమేష్ కిట్టినీ పోలీసులు అరెస్టు చేశారు.


Click it and Unblock the Notifications











