For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్థిక నేరాలు, చీకటి దందా గుట్టురట్టు చేసే యు.. శంకర్ నా స్ఫూర్తి.. కొవెరా

    |

    కటెంట్ బాగా ఉండే సినిమాలకు టాలీవుడ్‌లో ఆదరణ పెరుగుతున్నది. చిన్న చిత్రాలుగా విడుదలై భారీ విజయాలు సాధించిన RX 100, మళ్లీ రావా, గూఢచారి చిత్రాలే అందుకు సాక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం యు. కథే హీరో అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని యువ హీరో కొవెరా నటించడమే కాకుండా, నిర్మించి, దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది.

    యు మూవీ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని దర్శక, నిర్మాత కొవెరా మాట్లాడుతూ.. దేశంలో ఆర్థికపరమైన నేరాలు ఎలా జరుగుతున్నాయనే అనే పాయింట్‌ను తీసుకొని రూపొందించిన చిత్రం యు. ఆర్థిక నేరాలు, చీకటి వ్యాపారం వెనుక యంత్రాంగం ఏమిటి అనే కోణంలో సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది.

    Director and actor Kovera about U movie

    యు మూవీ తీయడానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నాకు స్ఫూర్తి. తెలుగు ప్రేక్షకులకు యు మూవీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని స్క్రీన్ ప్లే రైటర్ మధు వెల్లడించారు. తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, స్వప్నరావు, లహరి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్‌గౌడ్, సంగీతం: సత్య మహావీర్, నిర్మాత: విజయలక్ష్మీ కొండా, రచన-దర్శకత్వం: కొవెరా.

    English summary
    U movie is going to deal with Under world mafia. Betting, Racing things are main content for this movie. Kovera played few roles like actor, director, producer for this movie. This movie set to release on December 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X