twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు వల.. దర్శకుడు అజయ్ భూపతి పోలీసులకు ఫిర్యాదు

    |

    తన పేరును దుర్వినియోగం చేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నారనే ఆరోపణలపై యువ దర్శకుడు అజయ్ భూపతి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. క్యాస్టింగ్ కాల్స్‌తో తన పేరు వాడుకొంటూ తనను ఇమేజ్‌ను భ్రష్టుపట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజయ్ అందజేసిన వివరాలను, ఫిర్యాదును అందుకొన్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

    నా పేరుతో నకిలీ ఫేక్ అకౌంట్లతో

    నా పేరుతో నకిలీ ఫేక్ అకౌంట్లతో

    RX 100 పేమ్ అజయ్ భూపతి తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోషల్ మీడియాలో నా పేరుతో కొన్ని నకిలీ అకౌంట్లు సృష్టిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. చాలా మంది అలా నా పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి సినిమా ఆఫర్ల ఇప్పిస్తామని ఎరవేస్తూ అమ్మాయిలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం నాకు ఆందోళన కలిగించింది అని అజయ్ భూపతి తెలిపారు.

    ఓ అమ్మాయిని మోసం చేసే ప్రయత్నం

    ఓ అమ్మాయిని మోసం చేసే ప్రయత్నం


    గతంలో నా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌ను చూసి ఓ అమ్మాయి నాకు మెసేజ్ చేయడం జరిగింది. తాను మోసపోయానని చెబితే ఆ అమ్మాయికి అసలు విషయాలు చెప్పి ఆమె ఎదురైన సమస్యను సెటిల్ చేశాం. నా పేరుతో ఉన్న ఫేక్ ప్రొఫైల్స్‌పై నా టీమ్ ఇప్పటికే దృష్టిపెట్టి వాటి వివారాలు సేకరిస్తున్నది. అలాగే ఫేక్ అకౌంట్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అజయ్ భూపతి తన ప్రకటనలో పేర్కొన్నారు.

    అమ్మాయిలపై వల వేయడం

    అమ్మాయిలపై వల వేయడం


    నా ఫేక్ అకౌంట్ల సహాయంతో కొందరు అమ్మాయిలకు వల వేయడం అంతటితో ఆగలేదు. మరికొంత మంది అమ్మాయిలు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నామని నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ ‘7995267901) అనే నంబర్‌నే కొంత మంది అమ్మాయిలు నాకు చూపించారు. ఆ ఫోన్ నెంబర్ నుంచే కాల్స్ వచ్చాయని, తమను మోసం చేసే ప్రయత్నం చేశారనే విషయాన్ని చెప్పారు అని అజయ్ భూపతి తన ప్రకటనలో వెల్లడించారు.

    Recommended Video

    RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
    అందుకే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను

    అందుకే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను

    అయితే నా పేరుతో ఉండే ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిలు ఇబ్బందులకు గురికావడం నాకు చాలా బాధగా అనిపించింది. ఇలాంటి విషయాలకు తొందరగా అడ్డుకట్ట వేయకపోతే మరికొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావించాను. ఈ విషయాన్ని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అమాయకులు ఇలాంటి మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను అని అజయ్ భూపతి అన్నారు.

    English summary
    Director Ajay Bhupathi lodged a complaint at Hyderabad Cyber Crime: He filed a Cyber Crime case against the fraudsters (7995267901) defaming his name & trapping women in the name of Casting Calls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X