twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజాతో గాడ్ సెక్స్ ట్రూత్, పవన్ ప్రశ్నించడా, గాయిత్రి మాడా, తలసాని పాగల్: డైరెక్టర్ అజయ్ సంచలనం

    By Bojja Kumar
    |

    Recommended Video

    తలసాని, రోజా, పవన్‌పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్...!

    'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటి రోజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పాటు నటి గాయిత్రి గుప్తా మీద కూడా ఫైర్ అయ్యారు.

     నా సినిమా నాకు నచ్చ లేదు

    నా సినిమా నాకు నచ్చ లేదు

    నేను ఇండస్ట్రీకి వచ్చి పది పన్నెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ మూడు సినిమాలు చేశాను. 2013లో ‘వర్మగారు పోయారు' సినిమా చేశాను. అది ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. ఇపుడు ఎన్ హెచ్ 47లో బూత్ బంగ్లా చేశాను. ఇపుడు నేను నా సినిమా గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. నా సినిమా అసలు నాకు నచ్చలేదు. అందుకు కారణం సినిమాను నేను అనుకున్న రేంజిలో తీయలేదు.... అని దర్శకుడు అజయ్ కౌండిన్య తెలిపారు.

     ప్రతి ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ అమ్మాయిలు కావాలనే మాట్లాడుతుంటారు

    ప్రతి ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ అమ్మాయిలు కావాలనే మాట్లాడుతుంటారు

    సినిమా తీయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. వచ్చే ప్రతి ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ అమ్మాయిలు కావాలనే మాట్లాడుతుంటారు. అమ్మాయిలంటే ఏమైనా గోధుమ పిండా? షాపులో కొని తీసుకురావడానికి? అమ్మాయి అంటే ఒక సృష్టి. అలా చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అలాంటి వెదవ పనులు చేయలేదు కాబట్టే ప్రతిసారి కంప్రమైజ్ సినిమా చేశాను. నా ఆస్తులు అమ్మి సినిమా పూర్తి చేశాను కానీ నేను అనుకున్నట్లు తీయలేక పోయాను.... అని దర్శకుడు అజయ్ కౌండిన్య తెలిపారు.

     తలసాని, రోజా, పవన్‌పై వల్గర్ కామెంట్స్!

    తలసాని, రోజా, పవన్‌పై వల్గర్ కామెంట్స్!

    నా సినిమా గురించి కంటే ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడతాను. ఒక మాడదాని గురించి మాట్లడతాను. ఈ సమస్య సినిమా ఫీల్డుకు సంబంధించిన సమస్య. మీడియా వారికి న్యాయం అనిపిస్తే ముందుకు తీసుకెళ్లండి. లేదంటే వదిలేయండి. నేను ముందుగా మాట్లాడేది మన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి, రెండు మన సీనియర్ యాక్టర్ రోజా గురించి, మూడు మన వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, నాలుగు ఆడ మగ తేడా తెలియని అమ్మాయి గాయిత్రి గుప్తా గురించి ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నాను.... అంటూ దర్శకుడు కౌండిన్య మొదలు పెట్టారు.

     పాగల్ మంత్రి

    పాగల్ మంత్రి

    సినిమా ఫీల్డులో మధ్య తరగతి, చిన్న తరగతి సినిమాలు విడుదల చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర విభజన అయిన వెంటనే రాచకొండలో రెండు వేల ఎకరాల్లో ఫిలింసిటీ కడతామని ప్రకటన చేశారు. సినిమా కళాకారులకు, టెక్నీషియన్లకు 5 లక్షల హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూంలు అనౌన్స్ చేశారు. కానీ మన పాగల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం దాని జీవో సాంక్షన్ చేయించలేదు. గవర్నమెంటు వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ అనౌన్స్ చేసినవి అమలులోకి తీసుకురాలేదు. సినిమా ఫీల్డ్ నుండి ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ. 200 కోట్ల వరకు టాక్సులు కడుతున్నాం. మూడు సంవత్సరాలుగా 600 కోట్లు కట్టాం. కానీ మాకు మాత్రం హెల్త్ కార్డులు లేవు, డబల్ బెడ్రూంలు లేవు. రాచకొండ ఫిల్మ్ సిటీ జీవో కూడా సాంక్షన్ కాలేదు.... అంటూ అజయ్ కౌండిన్య మండి పడ్డారు.

     నువ్వు మంత్రిగా ఉండి ఎందుకు?

    నువ్వు మంత్రిగా ఉండి ఎందుకు?

    మా డైరెక్టర్స్ యూనియన్ తరుపున కొంత మంది వెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలవడానికి ఆయన ఇంటికెళ్లాం. ఆయనేమో యూసఫ్ గూడ చెక్ పోస్టు వద్ద చిన్న శ్రీశైలం యాదవ్ ఉంటాడు ఆయన్ను వెళ్లి కలవండి అని చెప్తారు. కళాకారులం మేమంతా కలిసి ఒక మినిస్టర్ కు చెప్పుకోవడానికి వెళితే తనేమో వేరొకరిని కలవాలని చెబితే ఆయన మినిస్టర్ గా ఉండి ఎందుకు? ఇలాంటి వ్యక్తి వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి మేలు జరుగలేదు.... అని అజయ్ కౌండిన్య తెలిపారు.

     రోజా ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అంట్ ట్రూత్ తీస్తా

    రోజా ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అంట్ ట్రూత్ తీస్తా

    రోజా గారు మా అమ్మలాంటి వారు, సీనియర్ యాక్టర్... ఆమెకు మా పాదాభివందనం. శాసన సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడతారు. కానీ మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడరు. మా సమస్యల గురించి మాట్లాడరు. ఆమె ఇండస్ట్రీ వారి కోసం ఎలాంటి సహాయం చేసింది లేదు, ఆమెకు మాకు సహాయం చేయడం చేతకాదు. రామ్ గోపాల్ వర్మ విదేశీ ఆర్టిస్టును పెట్టి సినిమా తీశారు. విదేశీ ఆర్టిస్టును పెట్టే బదులు రోజా గారిని పెట్టి తీస్తే సూపర్ గా ఉండేది. ఇప్పటి కైనా రోజా గారు ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2 సినిమా తీస్తాను.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    పవన్ కళ్యాణ్ కోసం 100 కోట్ల ప్రొడ్యూసర్‌ను పట్టాను

    పవన్ కళ్యాణ్ కోసం 100 కోట్ల ప్రొడ్యూసర్‌ను పట్టాను

    పవన్ కళ్యాణ్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడానికి ఆస్ట్రేలియాలో రూ. 100 కోట్ల రూపాయల ప్రొడ్యూసర్ ను పట్టుకున్నాను. కానీ ఈ రోజు ఆయన ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నాడు. ఆయన గొప్పాయన. కానీ మా సమస్య గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను.... అని అజయ్ కౌండిన్య తన సమస్యలు చెప్పడం మొదలు పెట్టారు.

     పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు

    పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు

    సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టినపుడు మా ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ప్రశ్నించడానికి కనిపించడం లేదా? చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్లు దొరకక, రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ కు చేతకాడం లేదా? ఆయనకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 2వేల థియేటర్లు ఉండేవి. ఈ రోజు 1400 థియేటర్లు మిగిలాయి. ఆ థియేటర్లు కూడా అగ్ర నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. దీంతో చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. ఇలాంటివి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇది ఆయనకు కనిపించడం లేదా? అంటూ..... అజయ్ కౌండిన్య ఫైర్ అయ్యారు.

    కేసీఆర్‌కు భయపడ్డాడు

    కేసీఆర్‌కు భయపడ్డాడు

    సినిమా పరిశ్రమకు చెందిన వారు ఊసరవెల్లుల్లా రంగులు మారుస్తూ ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ అలాంటి వారే. మొన్న చంద్రబాబు, మోడీ వెంట తిరిగారు. ఇపుడేమో తెలుగు రాష్ట్రాల్లో సొంతగా పోటీ చేస్తా అంటున్నాడు. వరంగల్‌లో కేసీఆర్ తాటతీస్తా అన్న పవన్ కళ్యాణ్.... ఇపుడు కేసీఆర్‌కు భయపడి సీఎం ఆఫీసుకు వెళ్లి క్షమాపణనలు చెప్పుకున్నారు. మా సినిమా ఫీల్డుకు న్యాయం చేయని పవన్ కళ్యాణ్ ప్రపంచానికి ఏం న్యాయం చేస్తాడు?.... అని కౌండిన్య ప్రశ్నించారు.

     ఫ్యాన్స్ కలుగజేసుకుంటే గుడ్డలూడదీసి గొడ్డుకారం వేసి కొడతా

    ఫ్యాన్స్ కలుగజేసుకుంటే గుడ్డలూడదీసి గొడ్డుకారం వేసి కొడతా

    ముందు పవన్ కళ్యాణ్ అభిమానులకు నా విన్నపం. ఈ సమస్య మా సినిమా ఫీల్డుకు సంబంధించిన సమస్య. ఈ సమస్య గురించి మీరెవరైనా తప్పుగా ఆలోచించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఐయామ్ సోలో.... నన్నెవ్వడేం పీకలేడు. ఎవరైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతాను. ఇది మా సమస్య. డైరెక్టర్ అనేవాడు ఉంటేనే హీరో ఉంటాడు. మేము ఆయనకు పని చేస్తున్నాం. మా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా వీరాభిమానులు ఉంటే సైడ్ అయిపోండి. మా సమస్యలు మేమే తేల్చుకుంటాం. ఎవరైనా ఎక్స్ ట్రా మాట్లాడితే బావుండదను అని హెచ్చరిస్తున్నాను... అంటూ అజయ్ కౌండిన్య మండి పడ్డారు.

     గాయిత్రి గుప్తా... ఆడా? మగా?

    గాయిత్రి గుప్తా... ఆడా? మగా?

    ఆడా మగా తేడా తెలియని అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి పేరు గాయిత్రి గుప్తా. మొన్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లందరి గురించి కూడా మాట్లాడింది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అమ్మాయిలను వాడేసుకుంటారని అంటోంది. ఆ అమ్మాయి ఆడా? మగా? తేడా అయితే నాకు తెలియడం లేదు. అలాంటి వ్యక్తికి డైరెక్టర్ల గురించి మాట్లాడే అర్హత లేదు.... అంటూ అజయ్ కౌండిన్య మండి పడ్డారు.

     పడుకుంటేనే క్యారెక్టర్ ఉంటుంది

    పడుకుంటేనే క్యారెక్టర్ ఉంటుంది

    సినిమా పీల్డు గురించి ఓపెన్ టాక్ చెబుతున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ ఇలా అందరి దగ్గర పడుకుంటేనే హీరోయిన్లకు, లేడీ ఆర్టిస్టులకు క్యారెక్టర్ ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయి డైరెక్టర్ల గురించి మాట్లాడటం ఏమిటి? గాయిత్రి గుప్తాకు నేను చెప్పేది ఒకటే. ఆమెను ఎప్పుటికైనా కలుస్తా ఆమెతో సినిమా చేస్తాను. నువ్వు ఆడా? మగా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వు.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద కామెంట్స్ చేశారు.

     కోసి గొడ్డుకారం పెడతా

    కోసి గొడ్డుకారం పెడతా

    సినిమా ఫీల్డులో ఉండే వారంతా ప్రాసిట్యూట్స్ అంటూ కొందరు బయటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇకపై ఎవరైనా అలా మాట్లాడితే కోసి గొడ్డుకారం పెట్టి కొడతాను అంటూ అజయ్ కౌండిన్య వార్నింగ్ ఇచ్చారు.

     ప్రతాని రామకృష్ణా గౌడ్, సాయి వెంకట్ గురించి

    ప్రతాని రామకృష్ణా గౌడ్, సాయి వెంకట్ గురించి

    చివరగా ఇద్దరి గురించి మాట్లాడదలుచుకున్నాను. ప్రతాని రామకృష్ణా గౌడ్, సాయి వెంకట్. తెలంగాణ నినాదం, తెలంగాణ డిపార్టుమెంట్ అని చెప్పి చాంబర్లు పెట్టి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. ఏ ఫంక్షన్ చూసినా వారి కటౌట్లు కనిపిస్తాయి. ఆర్ నారాయణ మూర్తి సార్ తో సినిమా చేస్తానని చెప్పి సాయి వెంకట్ వెంట నెల రోజులు తిరిగాను. వీరు సినిమా ఫీల్డులో కన్సల్టెంట్లలాగా అయిపోయారు. వీరందరినీ హెచ్చరిస్తున్నాను. మాకు ఏదైనా అన్యాయం జరిగితే గుడ్డలూడదీసి పచ్చి కారం వేసి కొడతాం... అంటూ ఫైర్ అయ్యారు.

    English summary
    NH4 Lo Bhooth Bangla Director Ajay Kaundinya Vulgar Comments on Pawan Kalyan, MLA Roja, Gayatri Gupta, Talasani Srinivas Yadav.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X