Jani Master Case:‘లవ్ జీహాద్ కు ప్రయత్నించాడా?’.. జానీమాస్టర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
Jani Master Case: ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి రావడం షాక్ కు గురి చేస్తోంది. వాస్తవానికి ఇలాంటి సంచలన ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా ఇటీవల మాలీవుడ్ పై జస్టిస్ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ముందుకు వచ్చి.. తాము కూడా బాధితులమే అంటూ తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకు వచ్చి పంచుకున్నారు. తాజాగా లైంగిక వేధింపులపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ(Bharadwaja Thammareddy) స్పందించారు. ఇంతకీ ఏమన్నారో మీరు కూడా ఓ లూక్కేయండీ.
జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ విషయం గానీ, నటి హేమ విషయం గానీ ఇవ్వన్ని ఇండస్ట్రీకి సంబంధించిన కావు. వారి వ్యక్తిగతం. వారు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ అన్నారు. కానీ, ఇందులో ఇండస్ట్రీకి సంబంధమేంది' అని అన్నారు. ఇక జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో జూనియర్స్, మహిళలు ఎదుర్కొంటున్న విషయాలకు సంబంధించింది. ఇందులో సమస్యపై కొన్ని ఉన్నాయి. వాటినిపై పరిశీలిస్తున్నామన్నారు.

ఈ విషయంలో రాజీ అనే విషయం ప్రసక్తి లేదు. వారు ఇద్దరి జర్నీ ఆరు సంవత్సరాలు. ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలని అంటే.. ఒక్కరి ఒక్కరూ ఫేవర్ గా ఉంటాం సహజం. ఈ సమయంలో అలాంటి అడగా వచ్చా.. లేదా తెలియదు. అడిగితే.. అంగీకారం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. అన్నారు. అంగీకారం లేకుండా లైంగికంగా వాడుకుంటే మాత్రమే శిక్ష అర్హుడే అన్నారు. ఇక ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడూ దాడికి చేశారనీ, పోక్సో కింద కేసు నమోదైందనీ అంటున్నారు. మీరు స్పందనేంటీ అన్ని ప్రశ్నించగా.. నా చట్టాలపై అంతగా అవగాహన లేదు. వాటి గురించి చూసుకోవడానికి పోలీసులు, కోర్టు ఉన్నాయి.' అని బదులిచ్చారు.
ఈ కేసులో లవ్ జీహాద్ అనే అంశముందని కొందరు అంటున్నారు. మీరే ఎలా చూస్తారని ప్రశ్నించగా.. ' ఇదో లవ్ జీహాద్ ఏముంది. మరీ హేమమాలినీ, ధర్మేందర్ పెళ్లి చేసుకున్నారు. అది లవ్ జీహాదా? హేమ మాలీని ముస్లిం.. ప్రస్తుతం ఆమె బీజేపీ ఎంపీ కూడా.. ముస్లిం సంప్రదాయం ప్రకారం మూడు నాలుగు పెళ్లిలు చేసుకోవచ్చు. అలా.. తమను ప్రేమించి, ఇష్టపడ్డ వారిని మత మార్చుకోమని బలవంతపెడుతారు. మతం మార్చడం అనేది వారి వెసులుబాటు. ఇండియాలో ఇలాంటి దోరణి ఎక్కువ కావడం వల్ల ఈ మాట వచ్చి ఉండవచ్చు అని అన్నారు.
అసోసియేషన్ గుర్తింపు కార్డు రాకుండా జానీ మాస్టర్ ఆపడనే ఆరోపణలపై స్పందిస్తూ.. 'ఆ బాధితురాలితో మాట్లాడారు. ఆమెకు వర్క్ విషయంలో అందరూ సపోర్టుగా నిలిచారు. కేసు చట్టపరిధిలో ఉంది. ఇక కార్డు విషయానికి వస్తే.. డాన్సర్స్ గుర్తింపు కార్డులపై దాదాపు 40 సంవత్సరాలు పలు ఆరోపణలున్నాయి. వివాదాలున్నాయి. డబ్బులు కట్టగానే కార్డు వస్తుందనడం కరెక్ట్ కాదు. చాంబర్ మొత్తం అప్రూవ్ చేసిన తరువాతనే వారికి కార్డు వస్తుంది. ఆ అమ్మాయికి కార్డు రాకుండా ఆపడు అనడం కరెక్ట్ కాదు' అని అన్నారు.
ఇండస్ట్రీ పెద్దలు ఇలాంటి చర్యలు పట్టించుకోవడం లేదా..? అని ప్రశ్నించగా.. 'ఇంతకీ ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇండస్ట్రీకి పెద్ద ఎందుకు ఉంటారు. ఎవరు కనిపెట్టారు? అనుకోకుండా.. దాసరి నారాయణ గారు ఇండస్ట్రీలో మంచి చెడులను పట్టించుకుని.. ఓ పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. ఆయన పోయగా.. ఇండస్ట్రీని పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు. అంత పరపతి ఉన్నా వారు లేదు. అలాగే.. అంత టైం ఉన్నావారు కూడా లేరు. ఏం చేసిన ఫీల్మ్ ఛాంబరే చేయాలి ' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

హేమ కమిటీ రిపోర్టుపై స్పందిస్తూ.. మన ఇండస్ట్రీపై కూడా అలాంటి కూడా గతంలో అలాంటి కమిటీ వేశారు. దాదాపు ఆరు సంవత్సరాలు అవుతోంది. దాని సూచనలు అది చేసింది. ఆ సూచనల మేరకు ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 3000 మందిని ఇంటర్వ్యూ చేశారు.
కానీ.. ప్రభుత్వం మారడంతో ఆ కమిటీ సిఫార్సులు ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేస్తుందా? గత కమిటీ సూచనలనే పాటిస్తుందా అనే చూడాలి' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.


Click it and Unblock the Notifications











