జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి మరో ప్రాజెక్ట్.. బాలయ్య కంటే ముందే..?

మొదట రైటర్ గా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ తరువాత దర్శకుడిగా మరెందుకు చా ప్రయత్నం చేశాడు. చేతివరకు వచ్చిన ఆఫర్స్ కూడా చివరి నిమిషంలో చేజారిపోయాయి. ఇక అతని తెలివిని మెచ్చిన కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ లోనే సినిమా చెసే అవకాశం ఇచ్చాడు. మొదట పటాస్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చిన అనిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత అతను నందమూరి బాలకృష్ణతో అలాగే మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలని బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పుడు కూడా అనిల్ కు సరైన అవకాశాలు రాలేదు. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో చేసిన సుప్రీమ్ సినిమా పరవాలేదు అనిపించగా అనిల్ పూర్తి స్థాయిలో ఆ విజయంతో సంతృప్తి చెందలేదు.

ఇక మరోసారి దిల్ రాజు ప్రొడక్షన్ లోనే రాజా ది గ్రేట్ అనే సినిమా చేసి మరో వినాయన్ని అందుకున్నాడు. అనిల్ ఎలాంటి కథనైనా సరే కామెడీగా బ్యాలెన్స్ చేయగలడని నిరూపించాడు. రాజా ది గ్రేట్ కథను రవితేజ కంటే ముందు కొందరు రిజెక్ట్ చేశారు కూడా. ఇక మొత్తానికి అనిల్ F2 సినిమాతో తన స్థాయిని మరో లెవెల్ కు పెంచుకున్నాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా బిగ్ హిట్ కావడంతో అనిల్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే అనిల్ కోరుకున్న హీరోలు మాత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం F3 సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

Director anil ravi pudi upcoming lady oriented project with star heroine

కామెడీ ఎంటర్టైనర్ గా F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా రానున్న ఆ సినిమాను అనిల్ ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే దాదాపు ఫినిష్ అయినట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇక రెండు పాటలు షూట్ మాత్రమే మిగిలి ఉందట. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఒక లేడి ఓరియెంటెడ్ కథను తెరపైకి తీసుకు రావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణతో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న అనిల్ అంతకంటే ముందే లేడి ఓరియెంటెడ్ సినిమాను చేయాలనీ ఆలోచిస్తున్నాడు.
ప్రస్తుతం సరైన నటి కోసం వేట కొనసాగుతోందట. అంతే కాకుండా కమల్ హాసన్ క్లాసిక్ సతీలీలావతిని రీమేక్ చేయడానికి కూడా ఈ యువ దర్శకుడు కూడా ఆసక్తిగా ఉన్నాడట.

రీమేక్ రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనిల్ రావిపూడికి రీమేక్ ఆలోచన కాకుండా రెండు స్క్రిప్ట్‌ లు అయితే సిద్ధంగా ఉన్నాయి. బాలకృష్ణతో సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు త్వరలో ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టవచ్చు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ అనిల్ నెక్స్ట్ సినిమా నిర్మించనుందని తెలుస్తోంది. ఇక F3 సినిమాను ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ - వెంకటేష్ తో పాటు మరో ముఖ్యమైన సునీల్ పాత్ర కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా ఆకట్టుకోబోతోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X