ఎఫ్ 2: ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజం అనిల్ రావిపూడి క్రియేషన్ కాదట!

'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను తెగ నవ్వించారు. హీరోయిన్లతో బికినీ సీన్స్, రొమాంటిక్ సీన్లు సైతం ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం యాక్సెప్ట్ చేసేలా చేశాడు.

ఈ చిత్రంలో వెంకీ ఆసనం, మెహ్రీన్ చెప్పే 'హనీ ఈజ్ ది బెస్ట్' మేనరిజం థియేటర్లకు వచ్చిన వారిని కట్టిపడేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆ మేనరిజం అనుకరిస్తూ కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి హనీ ఈజ్ ది బెస్ట్ డైలాగ్ వెనక ఉన్న రహస్యం వెల్లడించారు.

తమన్నా గురించి...

తమన్నా గురించి...

తమన్నా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ఆమె ప్రూవ్డ్ ఆర్టిస్ట్... చాలా అనుభవం ఉన్న నటి, ఎలాంటి పాత్ర అయినా ఇట్టే చేసేస్తుంది. హారిక అనే పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేసింది. చాలా డెడికేటెడ్‌గా పని చేస్తారంటూ ప్రశంసించారు.

మెహ్రీన్‌ అపుడు ఫీలైంది

మెహ్రీన్‌ అపుడు ఫీలైంది

మెహ్రీన్ ‘రాజా ది గ్రేట్' చేసినపుడు ఆ చిత్రంలో తాను పెర్ఫార్మ్ చేయడానికి తక్కువ స్కోప్ ఉందని ఫీలయ్యేది. మనసులో ఏదో చెయ్యాలని, ప్రూవ్ చేసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్ర ఇవ్వాలని అడుగుతుండేదని తెలిపారు.

అదే... హనీ ఈజ్ ది బెస్ట్

అదే... హనీ ఈజ్ ది బెస్ట్

మెహ్రీన్ తనను తాను, తన క్యారెక్టర్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంది. అలాంటి పాత్రను సినిమాలో పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆ పాత్ర డిజైన్ చేశాను. ఒక మనిషి ప్రపంచంలో అందరికంటే ది బెస్ట్ గా ఫీలైతే ఎలా ఉంటుంది?... అదే హనీ ఈజ్ ది బెస్ట్.

బికినీ సీన్లు అదరగొట్టారు

బికినీ సీన్లు అదరగొట్టారు

ఇప్పటి వరకు మెహ్రీన్ మీద యాక్టింగ్ సైడ్ పెద్దగా ఏమీ లేదు అనే కంప్లయింట్ ఉండేది. ఈ సినిమాతో అది ఫుల్‌ఫిల్ అయింది. గ్లామర్ పరంగా కూడా ఇద్దరూ అదరగొట్టారు. సెకండాఫ్‌లో బికినీ సీన్స్, ఫస్టాఫ్‌లో గ్లామరస్ సాంగ్ సూపర్‌గా చేశారు.

హనీ ఈజ్ ది బెస్ట్... మేనరిజం నేను క్రియేట్ చేసింది కాదు

హనీ ఈజ్ ది బెస్ట్... మేనరిజం నేను క్రియేట్ చేసింది కాదు

‘హనీ ఈజ్ ది బెస్ట్' అనే మేనరిజం రాజా ది గ్రేట్ సినిమాలో చేసిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తీసుకుంది. ఆ పాప సినిమా షూటింగ్ సమయంలో గుడ్ మార్నింగ్ చెప్పేందుకు వచ్చేది. ముద్దు పేరు హనీ. నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే... గుడ్ మార్నింగ్ అంకుల్, హనీ ఈజ్ ది బెస్ట్ అనేది. ఆ పాపను రేపు సక్సెస్ మీట్‌కు పిలిచి చెప్పాలనుకుంటున్నాను. ఈ డైలాగ్ ఆ పాప చెప్పే విధానం ఇంకా బావుంటుందని అనిల్ రావిపూడి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X