మహేష్ బాబుతో చేయాల్సింది.. కానీ లైన్ లోకి బాలయ్య వచ్చారు.. ఎందుకంటే?: అనిల్ రావిపూడి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది నుంచి స్టార్ దర్శకులు ఒకే సినిమాతో కొనసాగుతూ ఉన్నారు. లాక్ డౌన్ కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చింది అనే చెప్పాలి. ఇక వచ్చే ఏడాది నుంచి మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. కమర్షియల్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ రెండవ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ లోకి వచ్చి ఎంజాయ్ చేస్తారు అని చిత్ర యూనిట్ కూడా చాలా నమ్మకంతో ఉంది. అసలైతే మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ ఈసారి పొంగల్ బరిలో పెద్ద హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండడంతో రిలీజ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తప్పకుండా ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా అలరిస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

 Director anil ravipudi about feature projects with nbk and mahesh babu

అంతేకాకుండా ఈ దర్శకుడు భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇంతకు ముందు మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తన కెరీర్ లోనే కాకుండా మహేష్ బాబు కెరీర్లో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా మంచి గుర్తింపును అందించిందని తెలియజేశాడు. అయితే మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని అనుకున్న మాట వాస్తవమే కానీ అలా చేస్తే వర్కౌట్ కాకపోవచ్చు అని తెలియజేశాడు.

మధ్యలోకి సడన్ గా వెంకటేష్ వరుణ్ తేజ్ F3 సినిమా వచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాను. అసలైతే F3 సినిమా తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి ప్లాన్ జరిగింది. కానీ ఆయన త్రివిక్రమ్ సినిమా తర్వాత మళ్లీ వెంటనే రాజమౌళి సినిమా చేయాలి కాబట్టి సమయం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇక అప్పటి వరకు నేను నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాను చేసే అవకాశం ఉంటుంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం కూడా దాదాపు ఫినిష్ అయింది. ఇంకా ఎక్కువ సమయం ఉంటే మరింత డెవలప్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది.

బాలకృష్ణను గతంలో ఎప్పుడూ చూపించని విధంగా అలాగే మాస్ ప్రేక్షకులకు సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఆయన టైమింగ్ కు తగ్గట్టుగా కామెడీ కూడా ఉంటుంది. దాంతో పాటు నందమూరి బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని అంశాలు కూడా గట్టిగానే ఉంటాయి. ఇక మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి.. అంటూ ప్రతీ సినిమా పర్ఫెక్ట్ గా అభిమానులకు నచ్చే విధంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తానని అనిల్ రావిపూడి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X