twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పటాస్‌': ఏది పడితే అది తీయలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్: ''స్వతహాగా రచయితనే అయినా ఈ సినిమా విషయంలో నాలోని దర్శకుడి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాకి ఏమేం అవసరమో అది మాత్రమే చేశా. సంభాషణలు రాశాను కదా అని ఏది పడితే అది తీయలేదు. ఆరేడేళ్లు దర్శకత్వ విభాగంలో పనిచేశాను కాబట్టి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది'' అంటన్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన ఆయన 'పటాస్‌'తో మెగాఫోన్‌ చేపట్టారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ఆ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే.. ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు అనిల్‌ రావిపూడి.

    Director Anil Ravipudi about his latest Pataas

    కథ గురించి చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

    తన ప్రస్దానం వివరిస్తూ... ''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశాను. 'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు. 'ఈ కథలో మీరు నటిస్తే బాగుంటుంది, నన్ను నమ్మండి' అని చెప్పా. దీంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు'' అన్నారు.

    ఇక నందమూరి అభిమానులకి మళ్లీ సంక్రాంతి సందడి మొదలైనట్టుగా ఈ సినిమా వినోదాల్ని పంచుతుంది. ప్రస్తుతానికి 'పటాస్‌' విడుదలపైనే నా దృష్టంతా. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు.

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    Nandamuri Kalyan Ram’s much awaited upcoming movie ‘Pataas’ is getting ready to hit the big screens on Jan 23rd worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X