F2 దర్శకుడు.. పూరి జగన్నాథ్ కంటే జగమొండి .. అందుకే అన్ని హిట్లు!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలంటే ఎంతగా కష్టపడలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కుంటే కొంతమంది తొందరగానే సెట్టవుతారు. మరికొందరు ఏళ్ళ తరబడి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన తరువాత మొదటి అవకాశం అందుకుంటారు. ఇకపోతే మరికొందరు రైటర్స్ గా మారి ఆ తరువాత డైరెక్షన్ ఛాన్స్ ని చాలా తొందరగా పట్టేస్తుంటారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి ఒకరు.

బాక్సాఫీస్ దర్శకుడు..

బాక్సాఫీస్ దర్శకుడు..

దర్శకుడు అనిల్ రావిపూడి ముందు రైటర్ గా సక్సెస్ అయిన తరువాత డైరెక్షన్ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ ఆడియెన్స్ ని మెప్పించడంలో అనిల్ రూటే సపరేటు. సరిలేరు నికేవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

F3లో మరో హీరో..

F3లో మరో హీరో..

F2 సినిమాతో పూర్తి స్థాయిలో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ ఆ సినిమాకు సీక్వెల్ ని సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో మొత్తం కథను రెడీ చేశారట. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరొక స్టార్ హీరో సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ వివరణ ఇచ్చాడు.

పూరి జగన్నాథ్ కంటే జగమొండి..

పూరి జగన్నాథ్ కంటే జగమొండి..

చూడటానికి హోమ్లీగా సింపుల్ గా కనిపించే దర్శకుడు అనిల్ రావిపూడి కథకు రాయడంలో పూరి జగన్నాథ్ కంటే జగమొండి అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అనిల్ F3తో పాటు మరో నాలుగు కథలను సెట్ చేసే పనిలో ఉన్నాడట. పూరి జగన్నాథ్ కూడా ఒక కథ రాసే సమయంలో మరో నాలుగైదు కథలను పక్క పేపర్ లో రాస్తూనే ఉంటాడు. ఇక అనిల్ కూడా సైడ్ లైన్ లో ఇలా భవిష్యత్ ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నాడు.

Recommended Video

Mahesh Babu Sarileru Neekevvaru All Time TRP Record, Crosses Baahubali
సెట్స్ మీదకు వస్తే చాలు..

సెట్స్ మీదకు వస్తే చాలు..

ఇక సినిమా సెట్స్ పైకి వస్తే చాలు దర్శకుడు అనిల్ చాలా వేగంగా మిగతా పనులను పూర్తి చేస్తాడు. షూటింగ్ స్టార్ట్ చేస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్మాతకు అనుకున్న సమయానికి సినిమాను అందిస్తాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ లో కూడా Fకి సంబంధించిన ప్లాన్స్ రెడీ చేశాడట. సినిమా ఒక్కసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఆగిపోని విధంగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నాలుగు స్టోరీ లైన్లను సెట్ చేసుకున్న ఈ డైరెక్టర్ లాక్ డౌన్ పరిస్థితిని బట్టి వాటి పనిపడతాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X