మహేష్‌కు దిమ్మతిరిగే కృతజ్ఞత.. అనిల్ రావిపూడి కొడుకుకు ఏం పేరు పెట్టుకొన్నారో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో 2020లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను కుమ్మేసింది. మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పింది. అయితే ఈ సినిమా కోసం అవకాశం ఇచ్చినందుకు మహేష్ ‌బాబుకు అనిల్ రావిపూడి చూపించిన గ్రాటిట్యూడ్ ఏంటో తెలుసా?.. అది ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే..

 సుకుమార్‌కు కాకుండా అనిల్ రావిపూడికి

సుకుమార్‌కు కాకుండా అనిల్ రావిపూడికి

టాలీవుడ్‌లో దర్శకులను ఎంచుకోవడంలో మహేష్‌బాబుది ప్రత్యేకమైన శైలి. ఇండస్ట్రీలో హిట్టుకొట్టిన దర్శకుడికి వెంటనే ఆఫర్లు ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో F2 సినిమాతో మంచి హిట్‌తో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడికి పిలిచి సినిమా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే సరిలేరు నీకెవ్వరు చిత్రం. అయితే సుకుమార్‌కు అవకాశం ఇవ్వకుండా అనిల్‌కు ఛాన్స్ ఇవ్వడం మీడియాలో వివాదంగా మారింది.

అల్లు అర్జున్‌తో సుకుమార్

అల్లు అర్జున్‌తో సుకుమార్

అయితే మహర్షి సినిమా షూట్ సమయంలో రంగస్థలం సినిమాతో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు సుకుమార్‌తో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ఫ అనే సినిమా కథను మహేష్‌కు సుకుమార్ వినిపించారు. అయితే ఆ కథపై మల్లగుల్లాలు పడిన మహేష్ దానిని నాన్చుతూ అనిల్ రావిపూడితో కథా చర్చలు జరిపారు. అది తెలిసి వెంటనే సుకుమార్ తన కథను అల్లు అర్జున్‌కు వినిపించడం, ఆ తర్వాత ఓకే చెప్పడంతో కొంత వివాదం కూడా చోటుచేసుకొన్నది.

సరిలేరు ప్రమోషన్ సమయంలో అనిల్‌కు..

సరిలేరు ప్రమోషన్ సమయంలో అనిల్‌కు..

ఇలాంటి వివాదం నేపథ్యంలో మహేష్, అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు, సుకుమార్, అల్లు అర్జున్ పుష్ఫ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే అనిల్, మహేష్ సినిమా చకచకా షూటింగ్ జరిగిపోయి సంక్రాంతి బరిలో దూకింది. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా అనిల్ రావిపూడి దంపతులకు కుమారుడు జన్మించాడు. దానిని అనిల్ రావిపూడికి శుభసూచకంగా భావించనని చెబుతున్నారు.

Recommended Video

Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పాత్ర పేరు

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పాత్ర పేరు

సూపర్‌స్టార్ మహేష్ చూపించిన ఆదరణకు దర్శకుడు అనిల్ రావిపూడి ఘనంగా కృతజ్ఞతను చాటుకొన్నారు. తన కుమారుడికి సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మహేష్ పాత్ర పేరును తన కుమారుడికి పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. ఆ చిత్రంలో మహేష్ పాత్ర పేరు అజయ్ కృష్ణ. తనకు విజయాన్ని తీసుకొచ్చిన కుమారుడికి ఆ పేరును పెట్టుకొంటూ కృతజ్ఞతను చాటుకొన్నారు.

అనిల్ రావిపూడి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్

అనిల్ రావిపూడి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్

ఇంతకు అనిల్ రావిపూడి కుమారుడి పేరు ఏమంటంటే.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ పేరు అజయ్. అదే పేరుకు అంటే అజయ్‌కి సూర్యాంశ్ అనే పేరు జోడించి అజయ్ సూర్యాంశ్ అని పెట్టుకొన్నారు. తనను నమ్మిన హీరో మహేష్‌బాబుకు ఇంతకంటే చూపించాల్సిన కృతజ్ఞత ఏమైనా ఉంటుందా అని అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఇది నెవర్ బిఫోర.. ఎవర్ ఆఫ్టర్ అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X