Just In
- just now
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 2 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 34 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్
వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ డైరెక్టర్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. గతేడాది సంక్రాంతికి F2 సినిమాతో సక్సెస్ సాధించిన ఈ దర్శకుడు 2020 సంవత్సరానికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కిక్ స్టార్ట్ ఇచ్చాడు. దీంతో ఆయనపై క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంపై స్పందించిన అనిల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

ఎంటర్‌టైన్ చేయడంలో 'సరిలేరు నీకెవ్వరు'
‘ఎఫ్2'లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అదే కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు తోనూ కామెడీ పండించి ఎంటర్‌టైన్ చేయడంలో 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ‘ఎఫ్ 3' సీక్వెల్ తీయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై ఎన్టీఆర్ హీరోగా..
రొటీన్ కథలను కమర్షియలైజ్ చేసి, కామెడీ పండిస్తూ తెరకెక్కించగల సమర్థుడను అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేస్తానంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఎన్టీఆర్ హీరోగా రూపొందించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు.

అనిల్‌పై మెగాస్టార్ ఒపీనిమన్..
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేయాలనుకున్న తన కోరికను బయటపెట్టేశాడు అనిల్. చిరంజీవి గానీ కథ సిద్ధం చేయమంటే కేవలం 3 నెలల్లోనే స్క్రిప్ట్ రెడీ చేసి ఆయన ముందు పెట్టేస్తా ని అంటున్నాడు. పైగా ఇప్పటికే చిరు కూడా అనిల్ టేకింగ్‌కు ఫిదా అయిపోయాడు. గతంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో అనిల్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం అని చిరంజీవి చెప్పాడు కూడా.

అన్నీ అనుకున్నట్లే జరిగితే..
అనిల్ రావిపూడి సరైన కథ తీసుకొస్తే మెగా కంపౌండ్‌లోకి అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ కూడా అనిల్ కాదని అనకపోవచ్చు. దీన్నిబట్టి చూస్తే అనిల్ రావిపూడి కోరిక నెరవేరడానికి ఎంతో సమయం అవసరం లేదనిపిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!.