Just In
- 5 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పదేళ్ల క్రితం వచ్చిన షార్ట్ ఫిల్మ్.. జాతిరత్నాలు సినిమాలో డైరెక్ట్‌గా దించేసిన దర్శకుడు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత బిగ్గెస్ట్ కామెడీ హిట్ గా నిలిచింది జాతిరత్నాలు సినిమా. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసిన ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. అయితే సినిమాలో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ పదేళ్ల క్రితమే ఒక షార్ట్ ఫిల్మ్ లో వచ్చాయి. ప్రస్తుతం ఆ సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈజీగా కనెక్ట్ అయ్యింది
జాతిరత్నాలు సినిమా మొదటి రోజు కంటే కూడా ఆ తరువాత రోజులలో ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ తో అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. సినిమాలో ప్రతి పంచ్ డైలాగ్ వర్కౌట్ అయ్యింది. దర్శకుడు నాగ్ అశ్విన్ మేకింగ్ సింపుల్ గా ఉండడంతో అన్ని వర్గాల ఆడియెన్స్ కు సినిమా ఈజీగా కనెక్ట్ అయ్యింది.
అర్ధనగ్నంగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫోటోషూట్.. గ్లామర్‌తో దిమ్మతిరిగేలా

సినిమాలో ఆ షార్ట్ ఫిల్మ్ సీన్స్..
అయితే సినిమాలో చాలా వరకు కొన్ని కామెడీ సీన్స్ పదేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ లో వచ్చినవే. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణకు సంబంధించిన ఫోన్ కాల్ మొత్తం ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి తీసుకున్నదే. దర్శకుడు ఆ కామెడీ సన్నివేశాలను ఉన్నవి ఉన్నట్లుగా దీంచేశాడు. అయితే అప్పట్లో ఆ షార్ట్ ఫిల్మ్ ను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.

వ్యూవ్స్ రాకపోయినా
ఎవరు పట్టించుకోని ఆ షార్ట్ ఫిల్మ్ లోని సన్నివేశాలు ఒకప్పుడు. క్లిక్కవ్వకపోయినా కూడా ఇప్పుడు మాత్రం జాతిరత్నాలు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఆ షార్ట్ ఫిల్మ్ మరేదో కాదు. అనుదీప్ మొదటిసారి డైరెక్ట్ చేసిన మిస్స్‌డ్ కాల్. ఇప్పటికి కూడా ఆ షార్ట్ ఫిల్మ్ కు కనీసం 3లక్షల వ్యూవ్స్ లేవు. కానీ అందులోని జోకులు వాడేసి ఇప్పుడు 30కోట్ల బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేశారు.

అప్పుడే డిసైడ్ అయిన నాగ్ అశ్విన్
దర్శకుడు అనుదీప్ చేసిన ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన నాగ్ అశ్విన్ అప్పట్లోనే చాలా బాగా నవ్వుకున్నాడట. ఎలాగైనా అతనితో ఒక సినిమా చేయాలని అతని గురించి చాలా సార్లు కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పిట్టగొడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనంతరం అతనికి కనెక్ట్ అయినట్లు చెప్పాడు.

పెరిగిన ఫాలోయింగ్.. క్యాష్ అనుదీప్
సినిమాకు బాగా కనెక్ట్ అవ్వడంతో తన పంచ్ లను మళ్ళీ వాడిన అనుదీప్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. క్యాష్ అనుదీప్ అనే ట్యాగ్ తో బాగానే వైరల్ అవుతున్నాడు. ఇక నెక్స్ట్ మరో సినిమాను వైజయంతి బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.