ఆ సినిమాకు విజయ్, మహేష్ ఒప్పుకున్నారు.. కానీ అక్కడే తేడా వచ్చింది: స్టార్ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ దాదాపు ఒకే రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్నారు. ఇక వీరి మధ్య సినిమాకు సంబంధించిన రిలేషన్ షిప్ గట్టిగానే ఉంది. యాదృచ్చికంగా జరిగిందో లేక ఎలా జరిగిందో తెలియదు గాని విజయ్ కెరీర్ యూ టర్న్ తీసుకోవడానికి మహేష్ సినిమాలు గట్టిగానే ఉపయోగపడ్డాయి. అయితే ఒకసారి ఈ ఇద్దరిని ఒక సినిమాలో నటింపజేయలని ప్లాన్ చేసినట్లు ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురగదాస్ తెలిపారు.

విజయ్ కి మహేష్ వల్ల బెన్ఫిట్..
తమిళ ఇండస్ట్రీలో విజయ్ బాక్సాఫీస్ రేంజ్ పెరగడానికి ఒక్కడు రీమేక్ గట్టిగానే ఉపయోగపడింది. అంతకు ముందు వరకు విజయ్ కి పెద్దగా సక్సెస్ లు లేవు. అనంతరం పోకిరి రీమేక్ లో కూడా నటించిన విజయ్ మరో బాక్సాఫీస్ హిట్ అందుకొని మరింత క్రేజ్ అందుకున్నాడు. ఈ విధంగా మహేష్ బాబు సినిమాలు విజయ్ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

విజయ్, మహేష్ కాంబినేషన్..
అయితే ఒకానొక సందర్భంలో దర్శకుడు మురుగదాస్ మహేష్ బాబు, విజయ్ లతో ఒక సినిమాను చేయాలని అనుకున్నాడట. ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని మురగదాస్ ఒక బిగ్ బడ్జెట్ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియోని పోస్ట్ చేశారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు.

ఆ సినిమాలో విలన్ పాత్రల కోసం.
ఇక ఆ సినిమా మరేదో కాదు. మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బేడిసికొట్టిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఈ సినిమాలో విలన్ పాత్రలకు ఎస్.జె.సూర్యను కాకుండా హీరోలను తమిళ్, తెలుగు భాషలకు అనుగుణంగా మార్పులు చేయాలని అనుకున్నారట.

గుట్టు విపోయిన మురగదాస్
మణిరత్నం విలన్ సినిమా ఫార్ములాను యూజ్ చేయాలని అనుకున్నారు. స్పైడర్ లో తెలుగులో విలన్ గా విజయ్ ని చూపించి హీరోగా మహేష్ ని అనుకున్నారట. ఇక తమిళ్ లో విలన్ గా మహేష్ బాబును చూపించి హీరోగా విజయ్ ని చూపించాలని అనుకున్నారట. ఈ విషయాన్ని తమిళ్ స్పైడర్ ప్రమోషన్స్ లో మురగదాస్ బయటపెట్టారు.
Recommended Video

మహేష్ ఒప్పుకున్నాడు కానీ..
మొదట ఆ ఐడియాను మహేష్ కి చెప్పగా వెంటనే ఒప్పుకున్నారు. విజయ్ కూడా ఒప్పుకున్నారు కానీ విలన్ పాత్రను ఇంకాస్త హైలెట్ చేయాలని చెప్పారు. అయితే విలన్ రోల్ లో కొంచెం తేడా వచ్చినా కూడా హీరో పాత్ర స్థాయి తగ్గే అవకాశం వుందని విజయ్ అన్నారు. అలాగే మహేష్ కోసం తాను చేయడానికి సిద్ధమే అన్నాడు కానీ ఆ ఒక్క ఆలోచనపై విజయ్ కొంత ఆలోచింపజేశాక కరెక్ట్ అనిపించినట్లు మురగదాస్ తెలిపారు.


Click it and Unblock the Notifications











