Mahesh Babu స్పైడర్ ఎందుకు డిజాస్టరంటే? అల్లు అర్జున్‌‌తో మూవీపై దర్శకుడు మురగదాస్ క్లారిటీ

గజని, స్టాలిన్ లాంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా ఎన్‌ఎస్‌ పొన్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ మూవీ 16th August 1947. ఏఆర్‌ మురుగదాస్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహా నిర్మాత. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

1947 కథ చదువుతున్నప్పుడు..

1947 కథ చదువుతున్నప్పుడు..

మురుగదాస్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947..ఈ కథ చదువుతున్నపుడు చాలా అద్భుతంగా అనిపించింది. కథ చదివినప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా స్పెషల్ మూవీ. ఆగస్టు 16, 1947 పిరియాడిక్ ఫిల్మ్. ఆగస్టు 15 దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఆగస్టు 14, 15, 16 ఈ మూడు రోజుల్లో ఓ మారుమూల పల్లెలో జరిగే కథ ఇది అని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినా పోరాటమే..

స్వాతంత్ర్యం వచ్చినా పోరాటమే..

1947లో చుట్టూ అడవి కొండ మధ్య వున్న ఊరు. అక్కడికి ఒక వార్త చేయడం కష్టం. ఫ్రీడమ్ అంటే భయాన్ని జయించడం. ఆగస్ట్ 15న ఫ్రీడమ్ వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ఆ ఊరు ఇంకా స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఓ బ్రిటిష్ అధికారి ఈ వార్తని ఓ కారణం చేత వారికి తెలియకుండా దాచిపెడతాడు. వ్యక్తిగతంగా వారికి ఆగస్ట్ 16న స్వాతంత్రం పొందుతారు. ఆగస్ట్ 16న ఏం జరిగిందనేది చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది అని మురుగదాస్ తెలిపారు.

స్పైడర్ మూవీ ఫెయిల్యూర్‌పై

స్పైడర్ మూవీ ఫెయిల్యూర్‌పై

స్పైడర్ సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయాం. నిర్మాత టాగోర్ మధు గారికి హిట్ అందించలేకపోయాను. మా క్రియేటివిటి, ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు మ్యాచ్ కాలేకపోయాయి. త్వరలోనే నిర్మాత మధు గారికి, మహేష్ బాబుకు హిట్ అందిస్తాను అని ఏఆర్ మురగదాస్ చెప్పారు.

అల్లు అర్జున్ మూవీ గురించి

అల్లు అర్జున్ మూవీ గురించి


సినిమా ఇండస్ట్రీలో హీరోలను దర్శకులు, దర్శకులను హీరోలు కలవడం సాధారణం. అయితే అల్లు అర్జున్‌ను కలిసిన విషయం వాస్తవమే. అయితే ఆ ప్రాజెక్టు గురించి ఇంకా క్లారిటీ లేదు. ఆ సినిమా గురించి ఎదైనా డెవలప్‌మెంట్ ఉంటే తప్పకుండా చెబుతాను. ప్రస్తుతం 1947 సినిమా గురించి మాట్లాడుకొందాం. ఇప్పుడు ఏదైనా చెబితే..ఈ సినిమా గురించి వదిలేసి.. ఆ సినిమా గురించి రాసేస్తారు అని ఏఆర్ మురగదాస్ తెలిపారు.

1947 మూవీపై నిర్మాత మధు

1947 మూవీపై నిర్మాత మధు

నిర్మాత టాగోర్ మధు మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947 సినిమా చాలా యూనిక్ గా అనిపించింది. క్లైమాక్స్ అంతా గూస్ బంప్స్ వచ్చాయి. ఏప్రిల్ 14న సినిమాని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X