శ్రీను వైట్ల, వివి వినాయక్ పక్కన చోటు సంపాదిస్తా
నా స్నేహితులు శ్రీను వైట్ల, వివి వినాయక్ టాప్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకోవడం హ్యాపీ. కచ్చితంగా వాళ్ల పక్కన చోటు సంపాదించుకుంటా అని ధీమా వ్యక్తం చేసారు దర్సకుడు ఎయస్ రవికుమార్ చౌదరి. 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్...బాలకృష్ణతో 'వీరభద్ర', నితిన్ 'ఆటాడిస్తా', ఇటీవల 'ఏం పిల్లో... ఏం పిల్లడో' చిత్రాలని తెరకెక్కించారు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా మీడియాని కలిసి ముచ్చటిస్తూ ఇలా స్పంధించారు. అలాగే నా మిత్రులు, సన్నిహితులు అంటుంటారు..'డైరెక్టర్‌గా మంచి స్థాయిలో ఉండాల్సినవాడివి, ఇంకా ఇలాగే ఉన్నావు' అని. ఇక్కడ కెరీర్ గ్రాఫ్‌కి కొలమానం సక్సెస్ రేటే. ఒక్కోసారి మనం బాగా నమ్మినవి మిస్ ఫైర్ అవుతుంటాయి. అయినప్పటికీ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఏ స్థాయిని ఆశించానో ఆ స్థాయికి వెళతాననే నమ్మకం ఉంది అన్నారు. ఇక త్వరలో జగపతి బాబు కథానాయకుడిగా ఓ సినిమా ఉంటుంది. దీని తర్వాత సి.కల్యాణ్ నిర్మాతగా మరో సినిమాకి దర్శకత్వం వహిస్తాను. ఇప్పటిదాకా రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేశాను. ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాను. మంచి కథలు సిద్ధం చేసుకొన్నా అన్నారు. ధట్స్ తెలుగు ఈ దర్సకుడు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభూకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











