అలాంటివి ఊహించుకోవద్దు: ‘భాగమతి’ సినిమాపై దర్శకుడి క్లారిటీ

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ మూవీపై రూమర్లకు దర్శకుడు తెరదించారు.ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయడం లేదని, ఇది ఫాంటసీ మూవీ కాదని తెలిపారు.

By Bojja Kumar

Recommended Video

అలాంటివి ఊహించుకోవద్దు.. ‘భాగమతి’ పై దర్శకుడి క్లారిటీ

'బాహుబలి 2' తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం 'భాగమతి'. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా అనుమానాలున్నాయి. 'భాగమతి' టైటిల్ విన్న చాలా మంది ఇది హైదరాబాద్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని భావించారు.

ఇటీవల అనుష్క పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదని తేలి పోయింది. అయితే ఈ మూవీ ఏ జోనర్ అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇది ఫాంటసీ సినిమా అని కొందరు, హారర్ మూవీ అని మరికొందరు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇందులో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుందనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

రూమర్లపై దర్శకుడు అశోక్ క్లారిటీ

రూమర్లపై దర్శకుడు అశోక్ క్లారిటీ

‘భాగమతి' సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుందనే విషయంలో నిజం లేదని, ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని దర్శకుడు అశోక్ తెలిపారు.

ఫాంటసీ కథ కాదు

ఫాంటసీ కథ కాదు

‘భాగమతి' ఎంత మాత్రం కూడా ఫాంటసీ నేపథ్యాన్ని టచ్ చేయదని, డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. థ్రిల్లింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కొనసాగుతుందని తెలిపారు. అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణాన్ని ఇందులో చూడొచ్చు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయని తెలిపారు.

రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

‘భాగమతి' సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అటు చిత్ర నిర్మాతల నుండిగానీ, దర్శకుడి నుండి గానీ క్లారిటీ రాలేదు. సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి అంతా సిద్దంగా ఉన్నప్పటికీ అప్పుడు బాక్సాఫీసు వద్ద పోటీ ఎక్కువగా ఉండటంతో..... తర్వాత విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వంశీ, ప్రమోద్

వంశీ, ప్రమోద్

యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నామని తెలిపారు.

తారాగణం, తెర వెనక

తారాగణం, తెర వెనక

ఈ చిత్రంలో అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్ నటిస్తున్నారు. సంగీతం - ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్ - మథి, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, నిర్మాతలు - వంశీ - ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X