బాలకృష్ణ సినిమా వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది: డైనమిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ల హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో ముందుగా చెప్పుకునే పేరు నందమూరి బాలకృష్ణ. దర్శకుడు ఏది చెబితే అది చేసుకుపోయే హీరోగా ఆయనకు పేరుంది. అంతేకాదు, చాలా మంది కొత్త వాళ్లను దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా బాలయ్య సొంతమే. అందుకే ఆయన సినిమాల్లో చాలా వరకు వైవిధ్యంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్న బాలయ్యపై సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

 సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. అందరితో సినిమాలు

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. అందరితో సినిమాలు

తెలుగు సినీ ఇండస్ట్రీలోని రెండు తరాల హీరోలను డైరెక్ట్ చేసి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్. అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, మోహన్ బాబు వంటి సీనియర్లతో పాటు మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి జూనియర్లతోనూ సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం.

బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన డైరెక్టర్

బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన డైరెక్టర్

తెలుగులో తన మొదటి సినిమా చేసిన వెంటనే బీ గోపాల్ హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అనిల్ కపూర్ - రేఖ జంటగా నటించిన ‘ఇన్‌సాఫ్ కీ ఆవాజ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఇది సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే మళ్లీ టాలీవుడ్‌లోకి వచ్చిన ఆయన.. కొన్ని చిత్రాల తర్వాత మరో హిందీ చిత్రం ‘కనూన్ ఆప్నా ఆప్నా'ను తీశారు. ఇందులో సంజయ్ దత్ హీరో.

బాలయ్యతో భారీ విజయాలు.. లేపేశారు

బాలయ్యతో భారీ విజయాలు.. లేపేశారు

బీ గోపాల్.. తెలుగులో చాలా మంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ నందమూరి బాలకృష్ణతో ఆయనది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అందులో ‘లారీ డ్రైవర్', ‘రౌడీ ఇన్‌స్పెక్టర్', ‘సమరసింహా రెడ్డి', ‘నరసింహా నాయుడు' సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక, ‘పల్నాటి బ్రహ్మనాయుడు' మాత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఆ సినిమాపై ఇప్పటికీ తగ్గని విమర్శలు

ఆ సినిమాపై ఇప్పటికీ తగ్గని విమర్శలు

నందమూరి బాలకృష్ణతో తీసిన నాలుగు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు ఇండస్ట్రీని షేక్ చేసేలా వసూళ్లు కూడా సాధించాయి. అయితే, వీళ్ల కాంబోలో వచ్చిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు'తో మాత్రం ఇద్దరికీ చెడ్డ పేరు వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటికి ఎన్నో స్ఫూప్స్ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి.

బాలకృష్ణ సినిమా వల్ల చెడ్డ పేరు వచ్చింది

ఇదే సినిమాకు సంబంధించి బీ గోపాల్.. అలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పల్నాటి బ్రహ్మనాయుడు పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. నా తప్పుల వల్లే అలాంటి ఫలితం వచ్చింది. ఈ సినిమా వల్ల నాకు చాలా చెడ్డ పేరు కూడా వచ్చింది. తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడం లాంటి చాలా తప్పులు ఇందులో ఉన్నాయి' అని ఆయన చెప్పుకొచ్చారు.

Recommended Video

Nandamuri Balakrishna, A Man With A Golden Heart
బాలయ్య పసి బిడ్డ.. బంగారం

బాలయ్య పసి బిడ్డ.. బంగారం

ఈ కార్యక్రమంలో బీ గోపాల్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాను ‘వేటగాడు' అనే సినిమాలో నటించాల్సి రావడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. అలాగే, బాలయ్య గురించి కూడా మాట్లాడారు. ‘నా దృష్టిలో బాలయ్య ఒక పసి పిల్లాడు. బంగారం లాంటి వ్యక్తి' అంటూ పొగడ్తలు గుప్పించారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X