twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకురాలు బి జయ కన్నుమూత

    By Rajababu
    |

    Recommended Video

    Director B Jaya Passed Away Yesterday Night | ప్రముఖ జర్నలిస్టు,దర్శకురాలు బి జయ కన్నుమూత

    ప్రముఖ జర్నలిస్టు, మహిళా దర్శకురాలు బి జయ కన్నుమూశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజుకి ఆమె సతీమణి. బీ జయ మృతితో పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బీ జయ మృతి పట్ల పలువురు సీనీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చలన చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు.

    జనవరి 11న జన్మించిన

    జనవరి 11న జన్మించిన

    బి జయ 1964, జనవరి 11న జన్మించారు. ఆమెకు 54 సంవత్సరాలు. చెన్నై యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. జర్నలిజంలో డిప్లోమా పూర్తి చేశారు. అలాగే అన్నామలై నుంచి సైకాలజీలో పీజీ విద్యను అభ్యసించారు.

    ఉన్నత విద్య పూర్తయిన

    ఉన్నత విద్య పూర్తయిన

    ఉన్నత విద్య పూర్తయిన వెంటనే బీ జయ తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. చిత్రజ్యోతికి రిపోర్టర్‌గా ఆమె పాత్రికేయ జీవితాన్ని ఆరంభించారు.

    చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా

    చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా

    2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత 2005లో ప్రేమికులు, 2007లో గుండమ్మ గారి మనవడు, 2008లో సవాల్, 2012లో లవ్లీ, 2017లో వైశాఖం చిత్రానికి దర్శకత్వం వహించారు.

    మహిళా దర్శకుల్లో అత్యుత్తమ

    మహిళా దర్శకుల్లో అత్యుత్తమ

    ప్రస్తుత తరం మహిళా దర్శకుల్లో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గొప్ప పేరును సంపాదించుకొన్నారు. పలు చిత్రాలకు ఉత్తమ దర్శకురాలిగా అవార్డులు, రివార్డులు అందుకొన్నారు.

    సాయిధరమ్ తేజ్ ట్వీట్

    దర్శకురాలు బీ జయ మృతికి హీరో సాయిధరమ్ తేజ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బీఏ రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

    English summary
    Director B Jaya died with heart attack on Thursday night in Hyderabad. sHe was journalist in late 80s and 90s. She was 54 years and wife of popular PRO BA Raju. She directed Chantigadu, Premikulu, Gundamma Gaari Manavadu, Saval, Lovely, Vaishakam movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X