twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న మరణం ఈ స్క్రిప్టుకు మూలం.... వైశాఖం సినిమా వెనుక కథ

    జ‌య‌.బి పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 11. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... వైశాఖం సినిమా విశేషాలను పంచుకున్నారు.

    |

    జర్నలిస్ట్‌గా, రచయితగా, డైరెక్టర్‌గా తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌జయ.బి, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌ లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న "వైశాఖం" సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. జ‌య‌.బి పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 11. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... వైశాఖం సినిమా విశేషాలను పంచుకున్నారు.

    చిన్నతనం నుంచీ:

    చిన్నతనం నుంచీ:

    సిటీలోనే కాకుండా పట్టణాల్లోనూ అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. పక్క ఫ్లాట్‌లో ఉండే వాళ్ల ముఖాలు కూడా తెలీనంతగా అక్కడి వాతావరణం ఉంటుంది. చిన్నతనం నుంచీ అపార్ట్‌మెంట్‌లో పెరుగుతూ వచ్చిన నాలో ఆ వాతావరణం ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతూ వచ్చింది.

    నాన్న మరణించినప్పుడు :

    నాన్న మరణించినప్పుడు :

    మా నాన్న మరణించినప్పుడు నాలో కలిగిన భావాలు కూడా ఈ స్క్రిప్టుకు మూలం'' అని చెప్పారు జయ బి. ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైశాఖం'. ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్నారు. బుధవారం జయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

    ఐడెంటిఫై అవుతారు:

    ఐడెంటిఫై అవుతారు:

    ‘‘అపార్ట్‌మెంట్‌ కల్చర్‌పై నేననుకున్నది హీరో హీరోయిన్ ల పాత్రలతో చూపించే ప్రయత్నం చేశాను. హీరో నివసించే అపార్ట్‌మెంట్‌కు హీరోయిన్ ఎందుకు వచ్చింది, అతడ్ని మార్చాలని ఆమె ఎందుకనుకున్నదనేది ఇందులోని ప్రధానాంశం. అపార్ట్‌మెంట్‌లలో నివసించే ప్రతి ఒక్కరూ ఇందులోని పాత్రలతో ఐడెంటిఫై అవుతారు.

    కొత్తవాళ్లయితే బాగుంటుందనే:

    కొత్తవాళ్లయితే బాగుంటుందనే:

    ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఆలోచనల్ని రేకెత్తించే సినిమా ఇది. ఇందులో చూపించిన విషయాలు చూసిన వాళ్లు ఆశ్చర్యపోతారు. చాలా సన్నివేశాలు హృదయాన్ని స్పృశిస్తాయి. హీరో హీరోయిన్‌‌ల పాత్రలకు ప్రేక్షకులకు బాగా తెలిసిన తారలకంటే కొత్తవాళ్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో

    కథకు బాగా ప్లస్సయ్యాయి:

    కథకు బాగా ప్లస్సయ్యాయి:

    హరీశ్, అవంతికను తీసుకున్నాం. అవంతిక చేసింది చాలా బలమైన పాత్ర. కథను ఆమె పాత్ర ద్వారానే నడిపించాను. పకడ్బందీ కథనంతో చిత్రం ఆసక్తికరంగా తయారైంది. వసంత సంగీతం, సుబ్బారావు ఛాయాగ్రహణం కథకు బాగా ప్లస్సయ్యాయి. రాజుగారు నిర్మాత కావడం వల్ల నేననుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను.

    సంతృప్తికరంగా:

    సంతృప్తికరంగా:

    ఇంటర్నెట్‌లో కజకిస్థాన్ లోని లొకేషన్లు బాగుంటాయని చూసి, చెప్పగానే అక్కడ షూటింగ్‌ ప్లాన్ చేశారు రాజు. వాతావరణపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడ పాటల్ని రిచ్‌గా తీయగలిగాం. రషెస్‌ చూసుకొన్నాక సంతృప్తికరంగా అనిపించింది. ‘లవ్‌లీ' కంటే మరింతటి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం కలిగింది.

    పెద్ద విజయం :

    పెద్ద విజయం :

    నిజానికి ‘లవ్‌లీ' పెద్ద విజయం సాధించడంతో, దాని తర్వాత ఏం చెయ్యాలనే డైలమాతో జాప్యం చేశాను. ‘వైశాఖం' స్ర్కిప్టుకు బాగా కనెక్టయ్యాను కాబట్టే దీన్ని తీశాను'' అని వివరించారు.

    English summary
    Filmmaker B Jaya, who proved her mettle as a successful director with films such as Chantigadu, Premikulu, Sawal, Gundamma Gari Manavadu and Lovely, is back in reckoning with a new movie titled Vaisakam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X