twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్టిస్టును లం** అని పిలుస్తున్నారు, ఒళ్లు అమ్ముకునే వారు ఇండస్ట్రీకి...

    |

    Recommended Video

    Director Babji Controversial Comments On Tollywood || Filmibeat Telugu

    ఎన్టీఆర్ నగర్, వేట కొడవళ్లు, రఘుపతి వెంకయ్య నాయుడు లాంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాబ్జీ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. అపుడు నాలుగు గోడల మధ్య చాలా రహస్యంగా, ఇద్దరు ఇష్టపడితే ఉండేది. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిందని తెలిపారు.

    ఒకప్పుడు సినిమా పరిశ్రమలోకి వచ్చేవారంతా కళల మీద ప్రేమతో, నటిగా సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరికతో వచ్చేవారు. అప్పట్లో ఓ పెద్ద నటీమణి తనకు మేకప్ వేసిన వ్యక్తికి రోజూ కాళ్లకు దండం పెట్టేవారు. నన్ను అందంగా చూపిస్తుంది ఈయనే కదా అనే భావనతో అలా చేసేవారు. ఇప్పుడు వచ్చే వారు చాలా మంది క్రేజ్ కోసం వస్తున్నారని బాబ్జీ తెలిపారు.

    ఒళ్లు అమ్ముకునే వారు ఇండస్ట్రీకి వస్తున్నారు

    ఒళ్లు అమ్ముకునే వారు ఇండస్ట్రీకి వస్తున్నారు

    కాస్టింగ్ కౌచ్ లాంటిది ఇండస్ట్రీలో ఎక్కువ కావడానికి కారణం కళాకారులు కాకుండా, నటన మీద, సినిమాల మీద పాషన్ ఉండేవారు కాకుండా... ఒళ్లు అమ్ముకుని బిజినెస్ చేసేవారు ఇండస్ట్రీకి వస్తుండటమే. టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తే తమ రేటు పెరుగుతుందనే ఒకే ఒక్క ఆలోచనతో వస్తున్నారు. వెంటనే అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని అలవాటు చేస్తున్నారని బాబ్జీ తెలిపారు.

    ఇండస్ట్రీలోకి ఎంటరయ్యేందుకు చేయ కూడని పనులు చేస్తున్నారు

    ఇండస్ట్రీలోకి ఎంటరయ్యేందుకు చేయ కూడని పనులు చేస్తున్నారు

    ఒకప్పుడు డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్ల వరకే పరిమితమైన ఆ జాడ్యం... ఈ రోజు కో డైరెక్టర్లు, అసిస్టెంట్లు, మేకప్ మెన్లు, కెమెరా డిపార్టుమెంటువారు ఇలా అందరూ కాస్టింగ్ కౌచ్ చేసే వరకు వెళ్లింది. ఒళ్లు అమ్ముకునేవారు త్వరగా సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలాంటి చిన్న వ్యక్తులను ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యేందుకు చేయకూడని పనులు చేస్తున్నారు.

    కాస్టింగ్ కౌచ్ కంటే

    కాస్టింగ్ కౌచ్ కంటే

    కాస్టింగ్ కౌచ్ కంటే ఘోరమైనది ఇంకోటి జరుగుతోంది. సినిమా లేదా టీవీ షూటింగ్ లొకేషన్లలో అక్కడ ఆడవారు ఉన్నారనే సభ్యత కూడా లేకుండా బూతులు మాట్లాడుతున్నారు. లేడీ ఆర్టిస్టులకు సీన్లు వివరించేపుడు వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఇలాంటి వాటి వల్ల సదరు ఆర్టిస్టులు ఇబ్బంది పడ్డ సందర్బాలు అనేకం. ఆర్టిస్టు అంటే చాలా చీప్‌గా చూసే పరిస్థితి వచ్చింది. అలా చేసే వారు చెల్లి లేదా పెళ్లాం ముందు ఇలా మాట్లాడతారా? అంటూ బాబ్జీ ప్రశ్నించారు.

    ఆర్టిస్టును లం.. అని పిలుస్తున్నారు

    ఆర్టిస్టును లం.. అని పిలుస్తున్నారు

    కొందరు డైరెక్టర్లు.... మైకు పట్టుకుని ఒక ఆర్టిస్టును పిలిచేపుడు.... ఆ ల** పిలవండి అంటూ సంభోదిస్తుంటారు. ఇలాంటి మాటలు విని కూడా లేడీ ఆర్టిస్టులు మనసు చంపుకుని పని చేస్తున్నారు. వారిని ఏమైనా అంటే సినిమా నుంచి తీసేస్తారేమో భయంతో భరిస్తున్నారని బాబ్జీ తెలిపారు.

    ఆ దర్శకుడు చేసిన పనికి కాపురంలో చిచ్చు

    ఆ దర్శకుడు చేసిన పనికి కాపురంలో చిచ్చు

    ఇటీవల నాకు తెలిసిన ఓ ఫ్యామిలీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్లో ఫోటో దిగానికి వెళ్లిన నటితో... ఓ దర్శకుడు నడుము మీద చేయ్యేసి దగ్గకు లాక్కుని ఫోటో దిగాడు. ఇపుడు ఆమె కాపురంలో గొడవలు మొదలయ్యాయి. విడిపోయే పరిస్థితిలో ఉన్నారని బాబ్జీ తెలిపారు.

    English summary
    Director Babji about casting couch in Tollywood. Babji is an Indian film director, screen writer, who works primarily in the Telugu cinema. He is known as the Dynamic Director in Telugu Film Industry for his style of movie making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X