twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ మేకర్ బాలు మహేంద్ర కన్నుమూత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, రచయితగా, నిర్మాతగా, ఎడిటర్‌గా భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన ఫిల్మ్ మేకర్ బాలు మహేంద్ర ఇక లేరు. గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను చెన్నైలోని విజయ్ ఆసుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

    తమిళం, హిందీ, మళయాలం, కన్నడ, తెలుగు బాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో ఆయన 'నిరీక్షణ', కమల్ హాసన్-శ్రీదేవి జంటగా నటించిన 'వసంత కోకిల' చిత్రాలను తెరకెక్కించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి బాలు మహేంద్ర అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. బాలు మహేంద్ర మరణ వార్త సినీ ప్రేమికులను కలిచి వేసింది.

    Director Balu Mahendra died

    1939లో శ్రీలంకలోని తమిళ ఫ్యామిలీలో జన్మించిన బాలు మహేంద్ర అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన 'ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్' చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.

    లండన్ యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణెలోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగించారు బాలు మహేంద్ర.

    English summary
    Veteran filmmaker Balu Mahendra died on Thursday morning, after being admitted to a private hospital in Chennai following a heart attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X