బాపు గారికి తన మీదే తాను జోక్స్ వేసుకోవటం అంటే భలే సరదా. ఆ మధ్య ఆయన ఓ బ్రహ్మాండమైన జోక్ పేల్చారు. బాపు గారి మీద విపరీత మైన అభిమానం గల ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేదిట. పాపం ఆవిడ భర్తతో తప్ప ఎవరితోనూ సినిమాకు వెళ్ళది కాదట. బాపు గారి సినిమా రిలీజు కాగానే "ఏవండి ఇవాళ మొదటాట కెళదామండీ!" అని పోరేది. దానికి ఆ భర్త "ఇవాళ శుక్రవారం కదే. ఆఫీసుంది. రేపాదివారం వెడదాం!" అనేవాడుట. దానికావిడ "అంతవరకూ వుండదండీ!" అని కంట నీరు తుడుచుకునేదిట. ఇంతలా తన మీద తాను జోక్ వేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి.అది అలాంటి మహానుభావులకే సాథ్యం.