అపరిచితుడు లాంటి సినిమా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.. భరత్

By Rajababu

Recommended Video

మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు....కానీ..?

ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్' డైరెక్టర్ గా నిర్మాతలు డాక్టర్ శ్రీధర్ రాజు, డాక్టర్ తాళ్ల రవి, డాక్టర్ టిపిఆర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మేరా భారత్ మహాన్. ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్ ఉప శీర్షిక. ఈ సినిమా నవంబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకుడు సాగర్, దర్శకుడు బీ గోపాల్, గీత రచయిత చంద్రబోస్, తదితరులు హాజరయ్యారు.

 ఠాగూర్ లాంటి సినిమా

ఠాగూర్ లాంటి సినిమా

ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా దర్శకుడు భరత్ మాట్లాడుతూ ఈ సినిమా కధ చాలా బాగుంటుంది. కొంచెం గ్యాప్ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. భారతీయుడు, అపరిచితుడు, ఠాగూర్ లాంటి సినిమా మాదిరిగా కమర్షియల్‌గానే ఉంటూ మంచి సందేశం కూడా ఇస్తుంది.

ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తాం..

ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తాం..

ఈ సినిమాలో చదువు, వైద్యం అంశాలు సమాజంలో కీలకమైనవి. కానీ సగటు మనిషికి అందుబాటులో లేవు. అందుకే ఈ సినిమా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాం.

 ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు

ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు

మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రభుత్వం చేయ్యాల్సిన పనులను గుర్తు చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకే ఈ కథను సమాజానికి ఉపయోగపడేలా రూపొందించాం.

 సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ రేంజ్‌లో

సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ రేంజ్‌లో

ఈ చిత్రాన్ని సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ రేంజ్ సినిమాగా తెరకెక్కిస్తాం. అంతే కాదు ఈ సినిమాలో ఇంకో ప్రత్యకమైన రోల్ వుంది. ఆ పాత్రలో ప్రముఖ నటుడు నటిస్తారు. ఆయన నటించడం ద్వారా సినిమాప నాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది అని భరత్ అన్నారు.

 తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, తనికెళ్ళ భరణి, పోసాని, సాయిచంద్, ఎల్ బి.శ్రీరామ్, సన, ప్రగతి, జయప్రకాశ్ రెడ్డి, సురేఖవాణి, ఝాన్సీ తదితరులు. సాంకేతిక వర్గం: కథ డా శ్రీధర్ రాజు, మాటలు.ఎర్రంశెట్టి సాయి, సంగీతం: లలిత సురేష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎడిటర్ మేనగ శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X