twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా 'కులం'పై సంచలన కథనం: అవార్డుకు కారణమదేనంటూ?..

    |

    Recommended Video

    ఇళయరాజా 'కులం'పై సంచలన కథనం అవార్డుకు కారణమదేనంటూ ?

    మనదేశంలో ఏదీ కులమతాలకు అతీతంగా జరగదన్న భావన చాలా బలంగా పాతుకుపోయింది. పలానా వ్యక్తికి అవార్డు వచ్చిందంటే.. వెంటనే ఆ వ్యక్తిది 'ఏ కులం' అని సెర్చింజన్‌లో వెతికే సమాజం మనది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లకు సైతం కులం తోకలు తగిలించేయడమూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మ్యూజిక్ మేస్ట్రో 'ఇళయరాజా'పై కూడా కుల ముద్ర పడక తప్పలేదు.

     ఏంటీ వివాదం?:

    ఏంటీ వివాదం?:

    దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఇళయరాజాను వరించిన సందర్భంలో.. 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక కథనాన్ని ప్రచురించింది. 'ఇళయరాజా పద్మ అవార్డుతో దళితులను ఆకట్టుకునే ప్రయత్నం' అన్న హడ్‌లైన్‌తో ప్రచురితమైన ఆ కథనం వివాదాస్పదంగా మారింది.

     'ఆ దృష్టిని మళ్లించేందుకే..':

    'ఆ దృష్టిని మళ్లించేందుకే..':

    జిగ్నేశ్ మేవాని లాంటి వ్యక్తుల నాయకత్వంలో దళిత ఉద్యమాలు మరోసారి ఉధృతమవుతున్న తరుణంలో.. ఆ కమ్యూనిటీ ఎటెన్షన్‌ను తమవైపు మళ్లించేందుకే ఇప్పుడు ఇళయరాజాకు ఈ అవార్డు ప్రకటించారని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

     భారతీ రాజా కామెంట్స్:

    భారతీ రాజా కామెంట్స్:

    'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనంపై దిగ్గజ దర్శకుడు భారతీరాజా చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదంగా మారాయి. 'ఇళ‌య‌రాజా ద‌ళితుడు కావ‌డం వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని కొంద‌రు అంటున్నారు. మరోవైపు ఇళ‌య‌రాజా మాత్రం తననో బ్రాహ్మాణుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఆరాటపడుతున్నారు' అంటూ భారతీరాజా కామెంట్ చేశారు.

    ఇళయరాజా ఇప్పటికే బ్రాహ్మణుడు..:బీజేపీ

    ఇళయరాజా ఇప్పటికే బ్రాహ్మణుడు..:బీజేపీ

    భారతీరాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇళయరాజా ఇప్పటికే ఓ బ్రాహ్మణుడు అని, ఇప్పుడేదో కొత్తగా ఆ స్టేటస్ రావాలని ఆయన ఆరాటపడట్లేదని అన్నారు.

     'అవగాహనలేమితోనే..':

    'అవగాహనలేమితోనే..':

    'కొంతమంది అవగాహనలేమితో ఇళయరాజా 'అయ్యర్'గా మారిపోవాలనుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. అయ్యర్(బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక సెక్షన్) అంటే ఒక టీచర్ మరియు గొప్ప వ్యక్తి అని అర్థం. ఆవిధంగా ఇళయరాజా బ్రాహ్మణుడే.' అని హెచ్.రాజా వ్యాఖ్యానించారు.

     కులం రంగు పులమడంపై..:

    కులం రంగు పులమడంపై..:

    ఇళయరాజాకు కులం రంగు పులమడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏ కమ్యూనిటీకి చెందినవారైనా సంగీత ప్రపంచంలో ఆయనో శిఖరమని, అలాంటి వ్యక్తికి కులాన్ని అంటగట్టడం సరికాదని అంటున్నారు. మరోవైపు ఇళయరాజా మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు.

    'కులం పట్టింపు లేదు..':

    'ఇళయరాజాను ప్రజలంతా ఒక గొప్ప మ్యూజికల్ మేస్ట్రోగానే చూస్తారు, అదే ఆయన ఉనికి, ఆయన కులమేంటి? అనేదానితో ఎవరికీ పనిలేదు. అసలు దాన్ని పట్టించుకోరు కూడా. నిజానికి చాలామందికి ఆయన కులమేంటో కూడా తెలియదు. ఆయన సంగీతమే మాకు ముఖ్యం' అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు.

    Read more about: ilayaraja bharati raja
    English summary
    South India woke up to a headline in The New Indian Express on Friday that led to an outrage on Twitter and Facebook. “Dalit outreach with Ilaiyaraaja’s Padma”, the newspaper said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X