twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజ జీవిత సంఘటనలు ఆధారంగానే 'ఆరెంజ్':'బొమ్మరిల్లు' భాస్కర్

    By Srikanya
    |

    నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకున్న కథ ఇది. ప్రేమ మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అలాగే నాక్కూడా ఒక అభిప్రాయం ఉంది. ఒక విజన్ ఉంది. అదే ఈ సినిమాలో చూపించాను అంటూ తన తాజా చిత్రం ఆరెంజ్ గురించి దర్సకుడు భాస్కర్ మీడియాకు వివరించారు. రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో నాగబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మీడియాను కలిసి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

    మగధీర సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ కథ సిద్ధం చేశాను. చరణ్ సింగిల్ సిట్టింగ్ ‌లో కథను ఓకే చేశారు. ఈ కథలో కరెక్షన్స్ అంటూ ఏమీ లేవు..నిర్భయంగా ప్రొసీడ్ అయిపోవచ్చు. అని ప్రోత్సహించారు నాగబాబు. మగధీరకు ఏ మాత్రం పోలికలేని విధంగా, పూర్తి కాంట్రాస్ట్ ‌తో ఈ సినిమా ఉంటుంది. వీరందరి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఆరెంజ్ ను ఇంతబాగా తీయగలిగాను.

    అలాగే అమ్మాయిలందరూ తమకు తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో జెనీలియా పాత్ర ఉంటుంది. బొమ్మరిల్లు ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతకు మించిన పేరును ఇందులోని పాత్ర జెనీలియాకు తెచ్చిపెడుతుంది. యూత్ ‌ని ఓ కొత్తలోకంలో తీసుకెళ్లే అందమైన ప్రేమకథ ఇది అని చెప్పారు. ఇక ఇది ఎలాంటి సినిమా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఒక్కటి మాత్రం చెప్పగలను..చరణ్ కెరీర్ ‌లో ఇది నిలిచిపోయే సినిమా అవుతుంది అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X