'మూస పద్దతి రామ్ చరణ్ కి ఇష్టం లేదు'..దర్శకుడు భాస్కర్
ఒకే మూస పద్ధతిలో పోవడం చరణ్ కు ఇష్టం లేదు. భిన్నమైన రోల్స్ చేయాలనే తపన ఉన్న కథానాయకుడు. మగధీర తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని తపన పడుతున్నాడు. ఆయనతో కలిసినప్పుడు 'నాకు తగినట్టుగా మీ స్టైల్లో చెయ్యండి' అని అన్నారు. అలా తయారైందే ఆరెంజ్ చిత్రం అన్నారు. రామ్‌చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్‌లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి. చరణ్‌ను ఏ కోణంలో చూపిస్తే కొత్తగా ఉంటుందనే విషయం గురించి ఆలోచించా. చిరుత, మగధీరలో మాస్‌ను మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి. నాశైలిలో ఉండే ప్రేమకథ ఇది.ఇక కథ విషయానికి వస్తే..ముందు కథను సిద్ధం చేసుకుంటా. ఆ తర్వాతే నటీనటుల ఎంపిక. కానీ ఇక్కడ...అందుకు భిన్నంగా జరిగింది. చరణ్‌ను కలిసినపుడు ఓ సినిమా చేద్దాం అన్నారు. నా దగ్గరున్న కథ వినిపించా. తను ప్రత్యేకంగా విదేశీ నేపథ్యంలో కథ అయితే బాగుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఆరెంజ్ కథ తయారైంది అన్నారు.


Click it and Unblock the Notifications











