twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు కామెంట్స్ కు దర్శకుడు భాస్కర్ హర్ట్ అయ్యారా?

    By Srikanya
    |

    "నిర్మాత డబ్బు పెడుతుంటే...ఎన్నిరోజుల్లో సినిమా తియ్యాలి? అనే ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకులున్నారు" అంటూ నాగబాబు 'మిరపకాయ్‌' ఆడియో పంక్షన్ లో చేసిన కామెంట్స్ కు దర్శకుడు భాస్కర్ చాలా హర్ట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. డైరక్ట్ గా పేరు పెట్టి అనకపోయినా..తననే అన్నారని అర్ధం చేసుకున్న భాస్కర్ తన కోలిగ్స్ వద్ద భాధపడ్డాడని, తను మొదటే బడ్జెట్ గురించి చెప్పానని, అప్పుడు మంచి ప్రొడెక్టు రావాలి అని సగం పూర్తయిన తర్వాత బడ్దెట్ ఎక్కువతోందంటూ ఇబ్బందిపెట్టారని, అలాగే తాను టెక్నిషియన్స్ ని అందరినీ టాప్ పీపుల్ ని తెచ్చానని,అప్పుడు బడ్జెట్ పెరుగుతుందని, ఆస్ట్రేలియాలో షూటింగ్ అని కథ చెప్పినప్పుడే స్పష్టం చేసానని, వాటినేమీ పరిగణనలోకి తీసుకోకుండా డైరక్ట్ గా ఇలా కామెంట్ చేయటం ఎంత వరకూ సబబు అని తన సన్నిహితుల వద్ద వాపోయాడని వినపడుతోంది. అలాగే దర్సకులు శరీరంలోకి చేరే వైరస్‌లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయచేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు అనటం కూడా చాలామంది డైరక్టర్స్ కి ఇండైరక్ట్ గా తగిలిందని, రోజులు, ఫిల్మ్ లెక్క లేకుండా చేసే దర్సకులు అంతా కూడా నాగబాబు కామెంట్స్ కి అఫెండ్ అయ్యారని తెలుస్తోంది. మరో ప్రక్క కొందరు నిర్మాతలు ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నాగబాబు ఇలా ఓపెన్ గా బరెస్ట్ అవటం వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X