నువ్ ఎవడ్రా.. చిరంజీవి మాస్ వార్నింగ్.. పవన్ కల్యాణ్ అలిగాడని ఫోన్ చేసి మరి!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. అలాగే వారి బంధం గురించి కూడా. స్వయంకృషితో చిరంజీవి మెగాస్టార్, బాస్ గా మారితే.. ఆయన తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సొంతగా బీభత్సమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుని పవర్ స్టార్, జన సేనాని అయ్యారు. అయితే ఎవరి ఎన్ని మాటలు అన్నా క్షమిస్తూనే వచ్చారు. కానీ ఆయన కోప్పడటం మాత్రం పెద్దగా ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చిరంజీవికి కోపం వస్తే ఎలా ఉంటుందో తాజాగా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబి తెలిపారు.
జోడీగా-చెల్లెలిగా:చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్, కీలక పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు. శ్రీముఖి, రష్మి గౌతమ్, హైపర్ ఆది, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

శిల్పాకళా వేదికగా:ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉన్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ (Bhola Shankar Pre Release Event)ను హైదరాబాద్ శిల్పాకళ వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కోపం గురించి డైరెక్టర్ బాబి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, బాబీ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ మంటను:"చిరంజీవి గారికి నేను ఏం చెప్పగలను. అన్నయ్యను దూరం నుంచి అభిమానించడం వేరు. దగ్గరి నుంచి చూశాకా అభిమాని కంటే పెద్ద పదం ఏదైనా ఉందేమో అని మనమంతా వెతుక్కోవాలి. వీరయ్య తర్వాత నాకు గౌరవం మరింత పెరిగింది. హైపర్ ఆది స్టేజీపై ఒక్కో మాట చెబుతుంటే.. పైకి వచ్చి గాల్లోకి ఎత్తుకోవాలనిపించింది. అభిమానుల్లో ఉన్న బర్నింగ్ (మంట)ను ఆయన చెప్పాడు. ఆయనకు ఆవేశం, కోపం రాదు అంటారు. కానీ ఓ సందర్భం చెబుతాను" అని బాబి వెల్లడించారు.

డబ్బులు ఇచ్చాం కదా:"పవన్ కల్యాణ్ గారిది ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. లైట్ మెన్స్ షూలు, స్లిప్పర్స్ వేసుకుని ఇంట్లో నడుస్తున్నారు. అది చూసిన ఇంటి ఓనర్ పెద్దపెద్దగా అరిచేస్తున్నారట. ఇడియట్స్, స్క్రౌండల్స్ గెట్ అవుట్ అన్నారట. అది విన్న పవన్ కల్యాణ్ గారు వచ్చి మీకు ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా. మీ ప్లాబ్లమ్ ఏంటీ. వాళ్లు షూస్ వేసుకోనివ్వకపోతే నేను కూడూ షూటింగ్ చేయనని వెళ్లిపోయారు" అని బాబీ తెలిపారు.

20 బీప్ లు:"పవన్ కల్యాణ్ గారు వెళ్లిపోయిన విషయం ఎవరో నిర్మాతల ద్వారా తెలుసుకున్న చిరంజీవి గారు ఆ ఇంటి ఓనర్ కు ఫోన్ చేశారు. ఓ పది నుంచి 20 బీప్ లు. ఎవడ్రా నువ్ నా తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్లమనడానికి. నువ్వెంత నీ ఇల్లు ఎంత. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా నువ్ నీ ఇల్లు ఇచ్చింది. డబ్బులు తీసుకుంటున్నావ్ కదా అని చిరంజీవి అన్నారు" అని డైరెక్టర్ బాబీ పేర్కొన్నారు.

గంట అయింది:బాబీ ఇంకా కొనసాగిస్తూ "నీకు నిజంగానే నీ ఇంటి మీద ప్రేమ ఉంటే.. ఇంట్లో అందరితో ఉండి తాళం వేసుకును కూర్చో. షూటింగ్ లకు ఇవ్వొద్దు. రెంట్లు వసూలు చేయొద్దు. నా తమ్ముడు అలిగి వెళ్లి గంట అయంది కాబట్టి ఊరుకున్నా. వెంటనే తెలిస్తే వచ్చి నేనే షూటింగ్ జరిపించే వాన్ని అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి గారూ ఉన్నారు. తమ్ముడిని, మనలాంటి అభిమానులను అంటే ఆయన ఊరుకోరు" అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











