twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ బాబీ క్షమాపణ.. ఇంకా పరారీలోనే.. మెడకు హిట్ అండ్ రన్ కేసు!

    By Rajababu
    |

    Recommended Video

    Director KS Ravindra Said Sorry to Harminder Singh

    టాలీవుడ్‌ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) వివాదం ఓ కొలిక్కి వస్తున్నది. జూన్ 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో పాల్గొని వస్తున్న బాబీ వేగంగా కారు నడుపుతూ మరో కారును ఢీకొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వాహనదారుడు హర్మిందర్‌సింగ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

    బాబీ ప్రవర్తనపై ఫిర్యాదు

    ప్రముఖ దర్శకుడు బాబీ ప్రవర్తన సరిగా లేదు. కారుతో ఢికొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. కనీస మానవ విలువలను పాటించలేదు. తప్పతాగిన అతను క్షమాపణ చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు అని కొద్ది రోజుల క్రితం హర్మిందర్ సింగ్ పేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

    బాబీ క్షమాపణ చెప్పారు.

    ఇదిలా ఉండగా, శుక్రవారం (మే 25న) బాబీ తనకు క్షమాపణ చెప్పారని హర్మిందర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగతం వచ్చి నన్ను కలిశాడు. జరిగిన దానికి చింతిస్తూ క్షమాపణ కోరారు. అలాగే అతడి భవిష్యత్ బాగుండాలని నా తల్లి దీవెనలు తీసుకొన్నారు. ఈ వ్యవహారంలో సహకారం అందించినందుకు మీడియాకు, సోషల్ మీడియాకు, స్నేహితులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అని హర్మిందర్ తన పోస్టులో పేర్కొన్నారు.

     పరారీలో డైరెక్టర్ బాబీ

    పరారీలో డైరెక్టర్ బాబీ

    కేఎస్ రవీంద్ర ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇంట్లో కూడా ఉండటం లేదు. అతని గురించి వెతుకుతున్నాం. ఒకవేళ అతడు ఆచూకీ లభిస్తే మేము అతడికి నోటీసులు అందజేస్తాం. అతడిపై ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం కేసు నమోదు చేశాం అని జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్‌వో పీ చంద్రశేఖర్ వెల్లడించినట్టు ఓ వెబ్‌సైట్ పేర్కొన్నది.

     డైరెక్టర్ బాబీకి ఊరట

    డైరెక్టర్ బాబీకి ఊరట

    అయితే హర్మిందర్ సింగ్‌కు బాబీ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో బాధితుడు తన పిటిషన్ వాపసు తీసుకునే పరిస్థితి ఉంది. అలాగే మద్యం సేవించి కారు నడిపాడనే రుజువు లేకపోవడం ఈ కేసులో బాబీకి ఊరట కలిగించే అంశం. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం నుంచి బాబీ బయటపడే అవకాశాలు మెరుగుపడ్డాయి.

    English summary
    Tollywood director KS Ravindra rammed his car into another and was booked for rash driving by Jubilee Hills Police in Hyderabad. The actor was returning from Jr NTR's birthday party celebrations. It is said that the director was drunk while he was driving and hit the car of Harmender Singh, a resident of the area. Harmender took to social media to post the picture of his damaged car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X