తండ్రి అయిన జైలవకుశ డైరెక్టర్.. శుభాకాంక్షల వెల్లువ!

ప్రతి చిత్రంతో తన ప్రతిభ చాటుకుంటూ యువ దర్శకుడు బాబీ దూసుకుపోతున్నాడు. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాలకు బాబీ దర్శత్వం వహించాడు. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజగా బాబీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసే సంఘటన చోటు చేసుకుంది. ఈ యువ దర్శకుడు తండ్రి అయ్యాడు.

మరచిపోలేని రోజు

బాబీ సతీమణి నేడు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె జన్మించడంతో బాబీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అన్ని రోజులాగే ఈ రోజు కూడా చాలా సాధారణంగా గడిచిపోతుందని అనుకున్నా. కానీ మరచిపోలేని రోజుగా మిగిలిపోయింది. తన సతీమణి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని బాబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

కుటుంబం ఇంకాస్త పెద్దదిగా

కుటుంబం ఇంకాస్త పెద్దదిగా

కుమార్తె జన్మించడంతో తన కుటుంబం ఇంకాస్త పెద్దదిగా మారిందని బాబీ ట్వీట్ చేశాడు. ఇంత సంతోషంగా తానెప్పుడూ లేనని తెలిపాడు. బాబీ తండ్రిగా మారడంతో సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మవారి నవరాత్రుల్లో

దర్శకుడు హరీష్ శంకర్ బాబీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. అమ్మవారి నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది అంటూ హరీష్ ట్వీట్ చేశాడు. రచయితగా తన ప్రయాణం మొదలు పెట్టిన బాబీ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతిభ గల దర్శకుడిగా మారిపోయాడు.

పవర్‌తో మొదలై

పవర్‌తో మొదలై

రవితేజ నటించిన పవర్ చిత్రంతో బాబీ దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధించింది. ఆ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ మళ్లీ జైలవకుశ చిత్రంతో తన సత్తా చాటాడు. ఎన్టీఆర్ ని త్రిపాత్రాభినంలో చూపించి విజయాన్ని అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X