తారక్ మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.. ఎన్టీఆర్ స్పీచ్‌కు ఫిదా, ఆ ఒక్క మాటతో!

Recommended Video

NTR Speech @Aravindha Sametha Pre Release Event

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో అరవింద సమేత చిత్రం ముస్తాబవుతోంది. దసరా కానుకగా అరవింద సమేత చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్ననే హైదరాబాద్ లో జరిగింది. తీవ్రమైన భావోద్వేగ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తన తండ్రి హరికృష్ణ మరణించిన తరువాత విడుదల కాబోతున్న చిత్రం కావడంతో ఎన్టీఆర్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. అంతటి ఎమోషన్ లో కూడా అభిమానులని ఉద్దేశించిన ప్రసంగించిన ఎన్టీఆర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

తండ్రి జ్ఞాపకాలు

తండ్రి జ్ఞాపకాలు

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. ఓవైపు తండ్రి జ్ఞాపకాలతో కన్నీరు ఉబికి వస్తున్నా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. అభిమానుల గురించి, సినిమా గురించి విలపిస్తూనే మాట్లాడాడు. తన తండ్రి లేకుండా ఇలా సినిమా ఈవెంట్ జరుపుకోవాల్సి వస్తుందని భావించలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి

నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్ పై జైలవకుశ దర్శకుడు బాబీ ప్రశంసలు కురిపించాడు. తారక్ స్పీచ్ ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ మాటలన్నీ ఎన్టీఆర్ హృదయంలో నుంచి వచ్చాయని బాబీ ట్వీట్ చేశాడు.

తారక్‌ని అలా చూడడం

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కోసం ఇన్ని రోజులు వేచి చూసినందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని బాబీ తెలిపాడు. రాయలసీమ డైలాగులతో, బాడీ లాంగ్వేజ్ తో ఎన్టీఆర్ ని ఈ చిత్రంలో చూడబోతుండడం కన్నుల పండుగ అని బాబీ తెలిపాడు.

 ఆ మాటతో

ఆ మాటతో

ఎన్టీఆర్ ప్రసంగం మొత్తం ఉద్వేగంగానే సాగింది. చివర్లో తన ప్రసంగాన్ని ముగిస్తూ ఎమోషనల్ గా ఎన్టీఆర్ అభిమానుల ఉద్దేశించిన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నాన్నకు ఎలాగూ చేపలేకపోయా.. మీ అందరికీ చెబుతున్నా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.. మీ కోసం మీ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. నడిరోడ్డుపైకి రావాల్సిన రోజు అండగా నిలిచేది మీ కుటుంబం ఆ తరువాతే మేము అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించాడు.

అలాంటి పరిస్థితుల్లో కూడా

అలాంటి పరిస్థితుల్లో కూడా


ఎన్టీఆర్ స్పీచ్ పై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అంతటి భావోద్వేగ పరిస్థితుల్లో కూడా అభిమానులని ఉద్దేశించి చక్కగా మాట్లాడాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X