పవన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నా మారని పరిస్థితి!

Recommended Video

Director Bobby In Struggle With Sardaar Gabbar Singh

యువ దర్శకుడిగా మంచి ప్రతిభ ఉందని గుర్తింపు పొందాడు బాబీ. పవర్ చిత్రంతో తన సత్తాని చాటుకున్న బాబీ తక్కువ టైంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ సర్దార్ చిత్ర రిజల్ట్ ఏంటో అందరికి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ జైలవకుశ వంటి మంచి కథతో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసి మెప్పించాడు. స్టార్ హీరోలని సైతం తాను హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నా బాబీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. కథలని వెంట బెట్టుకుని ప్రస్తుతం హీరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట.

పవర్ తో సంకేతాలు పంపాడు

పవర్ తో సంకేతాలు పంపాడు

రవితేజ ద్వారా బాబీకి తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సాధారణమైన కథని తన దర్శకత్వ ప్రతిభతో మాస్ ఎలెమెంట్స్ ని ఆ చిత్రంలో హైలైట్ చేసిన బాబీ హిట్ అందుకున్నాడు. బాబీ టాలెంట్ కు ముచ్చట పడ్డ పవన్ పిలిచి మరి సర్దార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇచ్చాడు.

 పవన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాడు

పవన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాడు

పవన్ కళ్యాణ్ రాసిన అనాసక్తికరమైన కథతో బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం చేయవలసి వచ్చింది. ఈ చిత్రం పవన్ అభిమానులని సైతం తీవ్రంగా నిరాశ పరిచింది. పవన్ కళ్యాణ్ షాక్ నుంచి త్వరగానే తేరుకున్న బాబీ తనదైన శైలిలో జైలవకుశ కథని రాసుకున్నాడు.

 మూడు పాత్రల్లో అద్భుతంగా ఆవిష్కరించి

మూడు పాత్రల్లో అద్భుతంగా ఆవిష్కరించి

జైలవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో బాబీ అద్భుతంగా చూపించాడు. మూడు విభిన్నమైన మాడ్యులేషన్స్ లో ఎన్టీఆర్ పాత్రలని డిజైన్ చేసిన బాబీకి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత బాబీకి అవకాశాలు క్యూ కడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.

 అక్కినేని వారసుడిని ఒప్పించే ప్రయత్నం

అక్కినేని వారసుడిని ఒప్పించే ప్రయత్నం

సర్దార్ వంటి చిత్రం తరువాత ఎన్టీఆర్ ని సులువుగా ఒప్పించాడు బాబీ. కానీ జైలవకుశ చిత్రం తరువాత మాత్రం బాబీ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందట. బాబీ ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. నాగచైతన్యకు ఓ స్టోరీ లైన్ చెప్పగా చైతు సంతృప్తి చెందాడట. కానీ కథని బిల్డప్ చేసే సమయంలో మాత్రం పలు మార్పులు సూచిస్తూ చికాకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగాఛలోతో తాజాగా మంచి సక్సెస్ అందుకున్న నాగశౌర్యకి కూడా ఓ కథని రాసుకున్నాడట. బాబీని ఎవరు కరుణిస్తారో చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X