»   » ‘లెజెండ్’ బైకుపై బోయపాటి, దేవిశ్రీ ప్రసాద్ (ఫోటోలు)

‘లెజెండ్’ బైకుపై బోయపాటి, దేవిశ్రీ ప్రసాద్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ఈ నెల 28న లెజెండ్ చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. లెజెండ్ సినిమా కోసం పత్యేకంగా డిజైన్ చేయించిన హార్లే డేవిడ్సన్ బైకు, టాటా సఫారీ వాహనాలు కూడా సినిమా ప్రమోషన్లలో వాడేస్తున్నారు.

తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ లెజెండ్ బైకు నడుపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇది కూడా సినిమా ప్రమోషన్లో భాగమే అని కొత్తగా చెప్పక్కర్లేదు.

లెజెండ్

లెజెండ్

గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో ‘లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్

ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయన సినిమా నుండి ఏం కోరుకుంటారో....అన్ని రకాల అంశాలను సినిమాలో జోడించి ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ చిత్రంగా ‘లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్

ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్

ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు.

జగపతి బాబు

జగపతి బాబు

ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.

English summary
Director Boyapati Sreenu - Music Director Devi Sri Prasad on"LEGEND" Bike.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu