‘టి’ అమర వీరులు, కేసీఆర్ గురించి దర్శకుడు బోయపాటి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేపథ్యంలో పలువురు సినీతారలు తమ తమ స్పందన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసారు.
బోయపాటి శ్రీను స్టేట్మెంట్
''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కేసీఆర్ గారికి మరియు ఆయన కేబినెట్‌కు నా శుభాకాంక్షలు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది ద్విగుణీకృతం కావాలని, రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు వారిగా ప్రజలందరూ సోదర భావంతో కలిసే ఉండాలని మనస్తూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నా జోహార్లు.

బోయపాటి సినిమాల విషయానికొస్తే...
బాలయ్యతో 'లెజండ్' సినిమా తెరకెక్కించి మళ్లీ ఫాంలోకి వచ్చిన బోయపాటి శ్రీను ఆ తర్వాత మెగాహీరో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. రామ్ చరణ్ నుండి కూడా సుముఖరావడంతో బోయపాటి ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయితే ఈచిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదని, బోయపాటికి రామ్ చరణ్ హ్యాండిచ్చినట్లే అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం వీలైనంత త్వరగా పూర్త చేసి సెప్టెంబర్ నుంచి శ్రీను వైట్ల సినిమా చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో రామ్ చరణ్ -బోయపాటి సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











