ఉప్పెన 2పై మరో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. పాన్ ఇండియా కాదు.. అంతకుమించి!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ సినిమాలలో ఉప్పెన టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది. అంతేకాకుండా హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ కెరీర్ కు కూడా సినిమా ఎంతగానో హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఆఫర్స్ ఎన్నో వచ్చాయి. అయితే చిత్ర దర్శకుడు సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

సుకుమార్ చెప్పినట్లుగానే..

సుకుమార్ చెప్పినట్లుగానే..

సుకుమార్ దగ్గర గత కొన్నేళ్లుగా శిష్యరికం చేసిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్నాయి. ఇక విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఉప్పెన సినిమా వైష్ణవ తేజ్ కెరీర్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సుకుమార్ చెప్పినట్లుగానే సినిమా వంద కోట్ల బిజినెస్ చేసి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

ఉప్పెన కథకు సీక్వెల్

ఉప్పెన కథకు సీక్వెల్

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి కూడా వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. వీరిద్దరికీ కూడా ఉప్పెన సినిమా కంటే ముందే ఎన్నో ఆఫర్స్ రావడం విశేషం. ఒక్క సినిమాతోనే వారి సినీ జీవితం మారిపోయింది. అయితే ఉప్పెన సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వినిపించాయి. అయితే ఆ విషయంపై దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని చెప్పిన బుచ్చిబాబు ఒకవిధంగా ఉప్పెన కథ రాసే కంటే ముందే సీక్వెల్ కథను కూడా రాసుకున్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో సినిమా కథ ఎలా ఉంటుందో అని ఓ వర్గం ప్రేక్షకుల్లో మళ్లీ అంచనాలు పెరిగాయి.

అంతకుమించి అనేలా..

అంతకుమించి అనేలా..

దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమా తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక ఉప్పెన సీక్వెల్ తప్పకుండా ఉంటుందని కూడా మరోసారి వివరణ ఇవ్వడం విశేషం. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఉంటుందట. పాన్ ఇండియా సినిమాగా కాకుండా అంతకు మించి అనేలా ఉంటుందట. అంటే పాన్ వరల్డ్ సినిమాగా ఉంటుంది అని వివరణ ఇవ్వడం విశేషం.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
ఎన్టీఆర్ కోసం స్టోరీ..

ఎన్టీఆర్ కోసం స్టోరీ..

ప్రస్తుతం బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అయితే బుచ్చిబాబు చెప్పిన పాయింట్ కి ఇంప్రెస్ అయ్యాడు కానీ పూర్తి స్థాయిలో కథపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు ఆ కథను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరొకసారి ఎన్టీఆర్ కు పూర్తిగా వివరిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అగ్ర దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మరి బుచ్చిబాబు చెప్పే కథ ఆయనకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X