తప్పతాగి పట్టుబడ్డ బివిఎస్ రవి, వెంట రామ్ గోపాల్ వర్మ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత బివిఎస్ మరోసారి తప్పతాగి డంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ఏరియాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా తన కారులో వచ్చిన సినీ రచయిత బివిఎస్ రవి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు. రెండో సారి కావడంతో చర్యలు కఠినంగా ఉంటాయని సమాచారం. బివిఎస్ రవి వెంటే కారులో దర్శకుడు రామ్ గోపాల్ గోపాల్ వర్మ కూడా ఉండటం గమనార్హం.
బివిఎస్ రవి గతంలో ఇదే ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన కారులో హీరో రవితేజ, మరో నటుడు శ్రీనివాస్ రెడ్డిలు కూడా ఉన్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

బివిఎస్ రవి
పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయగా....బివిఎస్ రవి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.

కేసు నమోదు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండో సారి పట్టుండటంతో పోలీసులు బివిఎస్ రవిపై కేసు నమోదు చేసారు.

పోలీసులతో వాగ్వాదం
ఈ సందర్బంగా బివిఎస్ రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

చెడ్డ పేరు
బివిఎస్ రవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి చయితగా పేరుంది. పలు హిట్ చిత్రాలకు ఆయన తన రచనలు అందించారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటంతో చెడ్డపేరు మూటగట్టుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











